ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి మండిపడ్డారు. కరోనా క్వారంటైన్ కేంద్రాల్లో రోగులు పడుతున్న బాధలను ప్రస్తావిస్తూ ఆయన ఏపీ సర్కార్ పై నిప్పుచేరిగారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘రాష్ట్రంలో ఎన్నిక్వారంటైన్ సెంటర్లు నడుస్తున్నాయి. పౌష్టికాహారం పేరుతో కాంట్రాక్టర్లకు ఎంత చెల్లిస్తున్నారు? మెనూ వివరాలు ఏంటి?
రాష్ట్రంలో ఎన్నిక్వారంటైన్ సెంటర్లు నడుస్తున్నాయి.పౌష్టికాహారం పేరుతో కాంట్రాక్టర్లకు ఎంతచెల్లిస్తున్నారు? మెనూ వివరాలుఏంటి? గతవందరోజుల్లో క్వారంటైన్ లో ఎంతమందిఉన్నారు?మంచినీళ్లు,మందులైనా ఇస్తున్నారా?నాణ్యతలేనిఆహారం తినలేమంటున్న బాధితులఆక్రందనలు మీకు వినిపించడంలేదా @ysjagan గారు pic.twitter.com/UxMlBtSJSN
— Devineni Uma (@DevineniUma) July 6, 2020
గత వందరోజుల్లో క్వారంటైన్‌లో ఎంతమంది ఉన్నారు? మంచి నీళ్లు, మందులైనా ఇస్తున్నారా? నాణ్యతలేని ఆహారం తినలేమంటున్న బాధితుల ఆక్రందనలు మీకు వినిపించడంలేదా సీఎం జగన్ గారు’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా దినపత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన పోస్ట్ చేశారు.