డీజీసీఏ నూతన మార్గదర్శకాలు.. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించని ప్రయాణికులను బోర్డింగ్ దగ్గరే నిలిపివేయాలన్నారు. మాస్క్ ధరించిన తర్వాతే.. ఎయిర్‌పోర్టులోకి అనుమతించాలన్నారు. ఈ మేరకు పౌర విమానయాన శాఖ సీఐఎస్ఎఫ్‌కు నూతన మార్గదర్శకాలను తెలిపింది.

ఎయిర్ పోర్ట్- ప్రయాణికులు-మాస్కులు
ఎయిర్ పోర్ట్- ప్రయాణికులు-మాస్కులు

కోవిడ్ నిబంధనలు పాటించని ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిలీ హైకోర్టు ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఇంకా కరోనా ప్రభావం తగ్గలేదని, నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం 3,714 కరోనా కేసులు నమోదు కాగా, బుధవారం నాటికి 5,233 కేసులు పెరిగాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,90,282కు చేరాయి. ప్రస్తుతం దేశంలో 28,857 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news