భద్రాచలం ముంపు ప్రాంతాల అంటువ్యాధులపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ DH శ్రీనివాస్ రావు కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సమీక్షుస్తున్నాము…అంటు వ్యాధులు,సీజనల్ వ్యాధులు ప్రభలుకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు రిలీఫ్ సెంటర్ల నుండి గ్రామాలకు వెళ్లిన తరువాత అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని…ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు.
రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు సమన్వయం తో ప్రజలను అప్రమత్తంగా ఉంచుతున్నాము.. భద్రాద్రి,చర్ల, దుమ్ముగూడెం 11 ప్రాధమిక హాస్పిటల్ ఉన్నాయని అన్నారు. 41 ఆరోగ్య కేంద్రాలు ఎఫెక్ట్ అయ్యాయి…53 రిలీఫ్ సెంటర్లు చేసాము…10276 మంది కి వైద్య పరీక్షలు చేసామని వెల్లడించారు. మొత్తం 27 వేల మంది వరద బాధితులు అని….119 గ్రామాలు. వరద కు ఎఫెక్ట్ అయ్యాయని తెలిపారు. 106 మంది గర్భిణీ స్త్రీలను భద్రాచలం ఏరియా హాస్పిటల్ కు తరలించము..60 మంది గర్భిణీ స్త్రీలకు భద్రాచలం ఏరియా హాస్పిటల్ లో ఆపరేషన్ చేసాము…36 సాధారణ డెలివరీ లు అయ్యాయని తెలిపారు. 1028 మంది కోవిడ్ టెస్టులు చేయగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది..670 ఎడిషనల్ స్టాఫ్ డిప్లొయ్ చేసాము..స్టేట్ అండ్ dist లెవెల్ అధికారులు అందుబాటులో ఉన్నారు..హెల్త్ శిభిరాలు ఏర్పాటు చేసామన్నారు.