Dhamaka : ధమాకా నుంచి రొమాంటిక్ గ్లిoప్స్ రిలీజ్..రవితేజ ఫ్యాన్స్ కు ఇక పండగే

-

 

మాస్‌ మహారాజు రవితేజ వరుసగా సినిమాలు లైన్‌ లో పెట్టారు. ఖిలాడీ, రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాలు పెద్దగా హిట్టు కాకపోయినా.. ఎక్కడా తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నాడు రవితేజ. ఈ నేపథ్యంలోనే.. ఇప్పుడు ధమాకా, రావణాసుర, టైగర్‌ నాగేశ్వరరావు సినిమాలు చేస్తున్నాడు రవితేజ.

అయితే.. రవితేజ.. తన మాస్‌ యాంగిల్‌ చూపించేందుకు ధమాకా సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. బీమ్స్‌ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా… కార్తీక్‌ ఘట్టమనేని కెమెరామెన్‌ గా వ్యవహరించనున్నారు.

 

ఇది ఇలా ఉండగా.. తాజాగా థమాకా సినిమా నుంచి.. అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది. ఈ సినిమా నుంచి హీరో రవితేజ మరియు.. హీరోయిన్ శ్రీల మధ్య గల రొమాంటిక్ గ్లింప్స్‌ ను వినాయక చవిత సందర్భంగా రిలీజ్ చేసిన చిత్రం. ఇక ఈ అప్డేట్ తో రవితేజ ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news