కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ న్యాయశాఖ మంత్రి, ఆర్జేడీ నేత కార్తీక్ కుమార్ బుధవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపించగా.. ఆయన ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా, 2014లో జరిగిన కిడ్నాప్ కేసులో మంత్రి కార్తీక్ కుమార్ నిందితుడిగా ఉన్నాడు. దీంతో విపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టారు.
ఈ క్రమంలో సీఎం నితీష్ కుమార్ న్యాయశాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పించి వేరే శాఖకు బదిలీ చేశారు. అయినప్పటికీ కార్తీక్ కుమార్‌పై ఆందోళనలు కొనసాగాయి. దీంతో మంత్రి కార్తీక్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రెవెన్యూ శాఖ మంత్రి అలోక్ కుమార్ మెహతాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, ఆర్జేడీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కార్తీక్ కుమార్.. ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తనను మంత్రి వర్గంలో చోటు కల్పించారు.