ప్రతి గ్రామ, వార్డు సచివాలయం ఒక రిజిస్ట్రార్ ఆఫీసుగా మారబోతోంది – ధర్మాన

-

ఇవాళ రెవెన్యూ అధికారుల ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు, కోస్తాంధ్ర జిల్లాల కలెక్టర్లు, జేసీలు, రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, రీసర్వే తో 70 ఏళ్లుగా ఎవ్వరూ చేయని సాహసం ఈ ప్రభుత్వం చేస్తోందని.. ప్రతి గ్రామ, వార్డు సచివాలయం ఒక రిజిస్ట్రార్ ఆఫీసుగా మారబోతోందని వెల్లడించారు.

ప్రాధాన్యం వున్న శాఖల పైనే విమర్శలు వస్తాయని.. వెబ్ లాండ్ ఎంట్రీపై ఇంతకు ముందు కొన్ని విమర్శలు వచ్చేవన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.అయితే రిజిస్ట్రేషన్ అయిన రోజే ఆటో మ్యుటేషన్ అయ్యేలా చూస్తున్నామని వివరించారు. ఎంత ఎక్కువ భూమిని ఫ్రీ హోల్డ్ చేసి రైతులకు ఇస్తే ఆ మేరకు రెవెన్యూ పెరుగుతుంది… సంస్కరణల ఫలితాలు వినియోగదారులకు అందించేందుకే ఈ సదస్సు ఉపయోగపడాలన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

Read more RELATED
Recommended to you

Latest news