1785 రైల్వే జాబ్స్.. టెన్త్ ప్యాస్ అయితే చాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే లో 1785 అప్రెంటిస్‌ ఖాళీలు వున్నాయి.

ఫిట్టర్‌, టర్నర్, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్, మెకానిక్‌ వంటి పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్ధుల వయసు జనవరి 1, 2023వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ళు ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పని సరిగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో 50 శాతం మార్కుల తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఈ పోస్టులకి అప్లై చేసేందుకు ఫిబ్రవరి 10, 2023వ చివరి తేదీ. కనుక ఈలోగా అప్లై చేసుకోవడం మంచిది. రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు అయితే ఫీజు లేదు. ఎంపికైతే స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఈ పోస్టుల కి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు పూర్తి వివరాల కోసం https://www.rrcser.co.in/ లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news