ఈ నెల12న తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు : తలసాని

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నా చేస్తున్నారు… వారికి మద్దతుగా టిఆర్ఎస్ హైదరాబాద్ లో ఈ నెల12న భారీ ధర్నా చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి తలసాని యాదవ్‌. ఇందిరా పార్కు వద్ద టిఆర్ఎస్ పార్టీ ఈ నెల12న చెపట్టే ధర్నా ఏర్పాట్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ శ్రీలత పరిశీలించారు.

minister talasani srinivas yadav fires on bjp

రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని… దేశానికి అన్నం పెట్టే రాష్ట్ర0గా తెలంగాణ ఎదిగిందని తెలిపారు. కేంద్రం తెలంగాణను ప్రోత్సహించకుండా… ఇబ్బంది పెడుతుందని… కేంద్ర0 వ్యవసాయం రంగంలో నల్లచట్టాలని తెచ్చిందని వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు నిరంతర పోరాటం చేస్తామని స్పష్టం చేశారు మంత్రి తలసాని.

రాష్ట్రాల నడ్డి కేంద్రం విరుస్తుందని.. బిజేపీ రాష్ట్ర నేతలు డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహించారు. దేశంలోని అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసి ఢిల్లీలో ధర్నా చేస్తామని… పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలా జరుగుతాయో చూస్తామని హెచ్చరించారు. తెలంగాణ బీజేపీ నేతలని పిలిచి చెప్పాలని కేంద్ర బీజేపీ నేతలను కోరుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news