డబ్బులుంటే వేల కోట్ల ఆశ్రమాలు కట్టొచ్చు
అదేవిధంగా కట్టారు కూడా
మరి సమానత్వం ఎక్కడుంది
డబ్బులుంటే రాజకీయాలు వేల కోట్ల రూపాయలతో చేయొచ్చు
చేశారు కూడా ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కి ఫైనాన్షియర్
ఇప్పుడు బీజేపీ గూటికి చేరిపోతే ఏమౌతుంది?
అదే ఇవాళ్టి డిస్కషన్ పాయింట్…………..
తెలంగాణ వ్యాప్తంగా ఒక వివాదం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తెలంగాణ అనే కాదు ఆంధ్రా ప్రజలతోనూ నీరాజనాలు అందుకునే సమ్మక్క సారక్కలపై ఆధ్యాత్మిక ప్రబోధకుడు చిన జియరు స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇదంతా రాజకీయ ఎత్తుగడలో భాగమేనని కొందరు అంటున్నారు.త్వరలో బీజేపీ గూటికి మై హోం రామేశ్వర్ (ప్రముఖ పారిశ్రామిక వేత్త, కోటీశ్వరుడు) చేరనున్నారు.ఆయన కు టీవీ 9 తో పాటు టెన్ టీవీ కూడా ఉంది.
ఆయన చేరికతో మీడియా అంతా తమవైపే ఉంటుందన్న భావన ఒకటి బీజేపీ చేస్తుందన్న వార్తలు అప్పట్లో కలవరం రేపాయి. సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకల్లో అప్పటిదాకా తనకు క్లోజ్ గా ఉన్న మై హోం రామేశ్వర్ ఒక్కసారిగా బీజేపీ వైపు మారిపోయారు..దీంతో పరిణామాలు కూడా మారిపోయాయి..అని అప్పట్లో ప్రధాన మీడియాలో వార్తలు వెలుగు చూశాయి.
వాస్తవానికి తెలంగాణలో ఎప్పటి నుంచో బీజేపీ నిలదొక్కుకోవాలని చూస్తోంది.పార్టీని ఆశించిన స్థాయిలో నిలదొక్కుకునేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీ నాయకులను ఆకర్షిస్తోంది. బీజేపీ కి దీటుగా కేసీఆర్ ఉండడంతో ఇక్కడ కమలం పార్టీ నెగ్గుకు రాలేకపోతోంది.దీంతో ఏం చేయాలో అన్న అంతర్మథనంలో తరుచూ ఉంటోంది.
తాజా పరిణామాల నేపథ్యంలోతెలంగాణ రాష్ట్ర సమితికి దీటుగా ఉండే వ్యక్తి మై హోం రామేశ్వర్.. వేల కోట్ల రూపాయలకు అధిపతి. ఆయనతో రాజకీయం నడిపి లబ్ధిపొందాలన్నది బీజేపీ ప్లాన్. దీనిని నిలువరించేందుకు జియర్ స్వామి ఎప్పుడో చెప్పిన లేదా చేసిన వ్యాఖ్యలను వెలుగులోకి తెచ్చి నాటకాలు ఆడుతోందని తెలంగాణ రాష్ట్ర సమితిని ఉద్దేశించి పలువురు చేస్తున్న వ్యాఖ్యలు వర్తమాన పరిణామాలకు అద్దం పడుతున్నాయి.