మధ్యప్రదేశ్ లో వింత శిశువు జననం… రెండు తలలు, మూడు చేతులతో పుట్టిన శిశువు

-

మధ్యప్రదేశ్ లో ఓ వింత చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రత్లామ్ జిల్లాకు చెందిన షాహీన్ అనే మహిళ సోమవారం వింత శిశువుకు జన్మనిచ్చింది. శిశువుకు రెండు తలలు, మూడు చేతులు ఉన్నాయి.  మొండెంపై రెండు తలలు పక్కపక్కన ఉండగా… అందులో నుంచి మూడో చేయి ఉంది. జరాలోని నీమ్ చౌక్ కు చెందిన షాహీన్ బీ పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు ఆపరేషన్ చేశారు. రెండు తలలతో శిశువు ప్రసవించడంతో వైద్యులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ప్రస్తుతం శిశువును మెరుగైన వైద్యం కోసం ఇండోల్ లోని మహారాజా యశ్వంత్ రావు ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్చారు.

ఒకే మొండెంపై రెండు తలలతో జన్మించడాన్ని ‘డైసెఫాలిక్ పారాపాగస్’ అని పిలుస్తారని పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ బ్రిజేష్ లహోటి వెల్లడించారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని ఆయన అన్నారు. ఇటువంటి కేసుల్లో శిశువుల పరిస్థితి అనిశ్చితిగా ఉంటుందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శిశువు తల్లి రత్లామ్ లోనే చికిత్స పొందుతోంది. ఆపరేషన్ కు ముందుగా ఆల్ట్రా సౌండ్ స్కాన్ చేసినప్పుడు కవలలు ఉన్నారని వైద్యులు చెప్పారు. అయితే ఇలాంటి శిశువు ఉంటుందని వాళ్లు అంచనా వేయలేదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news