ఫ్యాక్ట్ చెక్: CBSE ఇలాంటి సర్కులర్ ని తీసుకు వచ్చిందా..? నిజం ఎంత..?

-

నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక ఫేక్ వార్త వస్తూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అన్న సరే సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. నిజానికి ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వాటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇదిలా ఉంటే తాజాగా ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అయితే మరి నిజంగా అది నకిలీ వార్తా లేదంటే అందులో నిజం ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.

తాజాగా సీబీఎస్ఈ సర్క్యులర్ ని జారీ చేసిందంటూ ఒక వార్త వచ్చింది. అయితే మరి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సర్క్యులర్ ని ఏమైనా జారీ చేసిందా..? ఈ వార్తా లో నిజం ఎంత అనే దాని గురించి చూద్దాం. తాజాగా సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షలకి సంబంధించిన వెయిటేజ్ గురించి ఒక సర్క్యులర్ ని జారీ చేసిందంటూ వార్త వచ్చింది.

అయితే మరి నిజంగా సీబీఎస్సీ విద్యార్థుల కోసం ఇలాంటి సర్క్యులర్ ని తీసుకు వచ్చిందా లేదా ఇది నిజమా కాదా అనేది చూస్తే… ఇలాంటి వార్తలు ఏమీ కూడా సీబీఎస్ఈ తీసుకుని రాలేదు అనే క్లియర్ గా తెలుస్తోంది. పైగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టర్మ్ వన్ పరీక్షల గురించి కానీ టర్మ్ టు పరీక్షల గురించి కానీ ఏమి చెప్పలేదు.

సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది ఇలాంటి వార్తలు ఏమి కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తీసుకురాలేదని ఇది ఒక ఫేక్ వార్త అని చెప్పింది. దీంతో ఈ వార్తల్లో నిజం లేదని క్లియర్ గా తెలుస్తోంది. ఇటువంటి వార్తలను అనవసరంగా మీరు నమ్మకండి. అలాగే ఇతరులకి షేర్ చేయొద్దు. ఇలాంటి ఫేక్ వార్తలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news