మహేశ్‌, ప్రభాస్‌ ఎం.ఎస్‌ రాజును హర్ట్‌ చేశారా?

Join Our Community
follow manalokam on social media

నిర్మాతను తండ్రితో పోలుస్తారు. ప్రొడ్యూసర్‌కు కష్టం.. నష్టం కలగకూడదంటారు. అందుకే.. గతంలో కొందరు హీరోలు సినిమా ఫ్లాప్‌ అయితే.. ఆ నిర్మాతకు మరో ఛాన్స్ ఇచ్చేవారు. తెలుగు ఇండస్ట్రీకి ఇద్దరు స్టార్స్‌ను అందించిన నిర్మాతను వాళిద్దరూ మర్చిపోయారు.

మహేశ్‌బాబు సూపర్‌స్టార్‌ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. స్టార్‌ ఇమేజ్‌ తీసుకొచ్చిన సినిమా ఒక్కడు. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈమూవీని ఎంఎస్‌ రాజు నిర్మించారు. సినిమా రిలీజై 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. నమ్రత తన ఇన్‌స్టాలో చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్‌ పెట్టగా.. నిర్మాత పేరు మెన్షన్‌ చేయలేదు. దీనికి ఎంఎస్‌ రాజు హర్ట్‌ అయ్యారు.

ఒక్కడు గురించి నమ్రత పెట్టిన పోస్ట్‌లో తన పేరు లేకపోవడంతో.. ట్విట్టర్‌ వేదికగా ఎమ్మెస్‌ రాజు స్పందిస్తూ.. ‘మిస్టేక్స్‌ జరుగుతూ వుంటాయి. నా పేరు మర్చిపోయినప్పటికి నమ్రత ఒక్కడును క్లాసిక్‌ మూవీగా చెప్పినందుకు సంతోషంగా వుంది.. గుడ్‌ లక్‌’ అంటూ మహేశ్‌బాబుని ట్యాగ్ చేస్తూ.. ట్వీట్ చేశారు. దీంతో రాజుగారు ఎంతగా బాధపడకపోతే.. ఇలా పోస్ట్‌ చేశారంటున్నాయి ఫిలిం వర్గాలు.

అదేమిటోగానీ.. ఎమ్మెస్‌రాజు చేతుల మీదుగా స్టార్ష్ అయిన వాల్లే ఆయన్ని మర్చిపోతున్నారు. వర్షం మూవీతో ప్రభాస్‌ను స్టార్‌ని చేశారు. సినిమా రిలీజై 17 ఏళ్లయిన సందర్భంగా ప్రభాస్ నిర్మాతను మర్చిపోయి ‘వర్షం’ సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

TOP STORIES

అందరి ముందు మాట్లాడాలంటే భయమా…? అయితే ఇది మీకోసం…!

చాలా మంది కింద చాలా బాగా మాట్లాడతారు. కానీ ఒక్కసారి అందరి ముందు నిలబడి మాట్లాడాలంటే చేతులు వణికి పోతాయి. అలానే పేనిక్ అయిపోతుంటారు. ఇది...