సంక్రాంతి సినిమాల రిజల్ట్ ఎలా ఉందంటే

-

ఆరంభం బాగుంటే.. శుభసూచకగా భావిస్తారు. ఈ ఏడాదంతా బాగుంటుందన్న ఆశ.. నమ్మకం వస్తుంది. గత ఏడాది మాదిరి 2021 సంక్రాంతి కూడా అదిరింది. ఈ సినిమా పండక్కి నాలుగు సినిమాలు రిలీజ్‌ అయితే వాటి రిజల్ట్‌ ఎలా వుంది అన్నదాని పై ఇప్పుడు టాలివుడ్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

కరోనా భయం వెండాడుతున్న టైంలో.. అందులోనూ 50% ఆక్యుపెన్సీ రూల్‌ వుండడంతో… థియేటర్స్‌కి జనాలు వస్తారా? రారా? పెట్టుబడి వస్తుందా? రాదా? అన్న అనుమానం సినిమా వర్గాల్లో వుంది. సంక్రాంతి సినిమాలు ఈ భయాన్ని పోగొట్టాయి. ఓపెనింగ్స్‌ చూస్తుంటే.. కరోనా భయం జనాల్లో లేదని తేలిపోయింది. మామూలు రోజుల్లో ఎలా వస్తారో… అలాగే వచ్చారు ఆడియన్స్‌.

ఈ సంక్రాంతికి రవితేజ క్రాక్‌తో.. రామ్‌ రెడ్‌తో… బెల్లంకొండ అల్లుడు అదుర్స్‌తో వచ్చారు. డబ్బింగ్ మూవీ మాస్టర్‌ విడుదలైంది. ముందుగా వచ్చిన క్రాక్‌ శుభారంభం ఇచ్చింది. రిలీజ్‌ ఒకరోజు ఆలస్యమైనా.. పాజిటివ్‌ టాక్‌తో.. ఇప్పటికీ మంచి వసూళ్లతో సంక్రాంతి మొనగాడుగా దూసుకుపోతున్నాడు మాస్‌రాజా. క్రాక్‌ తర్వాత వచ్చిన మాస్టర్ టాక్‌ ఎలా వున్నా.. భారీ ఓపెనింగ్స్‌ రాబట్టింది. సినిమా డబ్బింగ్‌ రైట్స్‌ను 8 కోట్లకు కొంటే.. ఇప్పటికే పెట్టుబడి రాబట్టిందట. అదిరింది.. విజిల్‌ తర్వాత వచ్చిన మాస్టర్‌తో విజయ్‌ తెలుగులో హిట్ కొట్టాడు.

పండగనాడు వచ్చిన రామ్‌ రెడ్‌ మంచి వసూళ్లనే రాబడుతోంది. ఫస్ట్ డే 6 కోట్లకు పైగా షేర్ కలెక్ట్‌ చేసి.. సత్తా చాటాడు వస్తాద్‌ రామ్‌. వీకెండ్‌ నాటి కలెక్షన్స్‌ వస్తేగానీ… రెడ్‌ రిజల్ట్ ఏమిటో తెలియదు. మొత్తానికి సంక్రాంతి సినిమాలపై వున్న కరోనా భయాన్ని పోగొట్టి.. టాలీవుడ్‌కు ఊపు తీసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news