ఆ వ్యాక్సిన్ సంస్థే ట్రంప్ గెలుపును అడ్డుకుందా..అంటే అవును నా ఓటమికి ఫైజర్, బయో ఎన్టెక్‌లే కారణమంటున్నాడు టెంపరి ట్రంప్. ఓటమికి కారణాలు వెతుక్కుంటున్న ట్రంప్ ఫైజర్ సంస్థపై ఆరోపణలు గుప్పించాడు. కోవిడ్-19 వ్యాక్సీన్ రేసులో ఫైజర్ ముందంజలో నిలిచింది. కరోనాపై చికిత్సలో ఫైజర్ 90శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలిందని సంస్థ యాజమాన్యం తెలిపింది.కానీ ట్రంప్ మాత్రం ఈ ప్రకటనపై మండిపడ్డారు.
వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తోందన్న విషయాన్ని ఫైజర్, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ సంస్థలు కావాలనే దాచిపెట్టాయని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆరోపించారు. తన గెలుపును అడ్డుకునేందుకే ఈ రెండు సంస్థలు టీకా అభివృద్ధిపై ప్రకటనను ఆలస్యం చేశారని మండిపడ్డారు. కావాలనే ఎన్నికల ఫలితాలు వెలువడిన ఐదు రోజుల తర్వాత వ్యాక్సిన్‌పై అప్‌డేట్ వచ్చిందని, ఇదంతా కుట్రపూరితంగా జరిగిందని ట్రంప్ ఫైరయ్యాడు.
ఒకవేళ జో బైడెన్ అధ్యక్షుడిగా ఉంటే వ్యాక్సిన్ వచ్చి ఉండేది కాదని, ఎఫ్‌డిఎ సైతం ఇంత త్వరగా ఆమోదించి ఉండేది కాదని ట్రంప్ అన్నారు. ఫైజర్ సంస్థ ఎన్నికల తర్వాతే వ్యాక్సిన్‌పై ప్రకటన చేస్తారని తాను గతంలోనే చెప్పానని, ఎందుకంటే వారికి అంత ధైర్యం లేదన్నారు ట్రంప్. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రాణాలు కాపాడటానికి వ్యాక్సిన్‌పై ఎఫ్‌డిఎ ముందే ప్రకటన చేసి ఉండాల్సింది అంటూ ట్రంప్ తెలిపారు.