బీహార్ లో ఎన్డీఏ గెలుపు.. కానీ !

-

ఉదయం నుంచి ఉత్కంఠగా సాగుతున్న బీహార్ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ ఒక కీలక దశకు చేరుకుంది బీహార్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను సాధించింది. ఇప్పటికే ఎన్డిఏ కూటమి 122 సీట్లు సాధించింది. ప్రస్తుతం బీహార్లో ఎన్డీఏ కూటమికి నూట ఇరవై ఐదు స్థానాల్లో లీడింగ్ లో ఉండగా మహా ఘాట్ బంధన్ కూటమి 111 స్థానాల్లో ఉంది. దీంతో బీహార్ లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే ముందు నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఆర్జెడి కూటమికి అనుకూలంగా రావడంతో ఆర్జెడి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావిస్తూ వచ్చారు.

కానీ అనూహ్యంగా మధ్యలో బీజేపీ కూటమి ఊపందుకోవడంతో ఆర్జెడి వెనకబడి పోయిందని చెప్పాలి. ఇక 7,8 స్థానాల దాకా గెలుచుకుంటుందని భావించిన ఎల్జేపీ కూడా ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నాలుగో సారి వరుసగా నితీష్ అక్కడ పాలన పగ్గాలు చేపట్టనున్నారు. ఎందుకంటే నితీష్ కుమార్ తమ సీఎం అభ్యర్థిని ఎన్డీఏ కూటమి చెబుతూ వస్తోంది. అయితే కూటమిలో అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరిస్తుండడంతో ఈ సీఎం పదవి ఎవరికి ఇస్తారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక అక్కడ ఎన్డీఏ కూటమి గెలుపు దిశగా పయనిస్తుందని తెలుసుకున్న కార్యకర్తలు రోడ్డు మీదకి ఎక్కి సంబరాలు మొదలు పెట్టారు. ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం పాట్నాకు చేరుకుంది, దీంతో సీఎం అభ్యర్థి ఎవరు అనే దాని మీద మళ్లీ చర్చలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news