ఈ రోజుల్లో చిన్నపిల్లలకు డైపర్ వాడని అమ్మ అంటూ ఉంటుందా చెప్పండి.. ఇప్పుడంటే..రకరకాల బ్రాండ్లు వచ్చాయి..మనం కూడా తెలిసినవాళ్లకు పిల్లలు పుడితే..ఈ బేబీకిట్ ను బహుమతిగా ఇస్తుంటాం.. అసలు ఇలాంటి ఒక డైపర్ ను కనిపెట్టింది ఎవరూ..పిల్లలకు టాయిలెట్ కు వెళ్లినా మాటిమాటికి ఇబ్బందిలేకుండా ఉండేలా చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చి ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా..
ఇంకెవరో ఓ తల్లి.. ఆ తల్లికి వచ్చిన ఆలోచన వల్లే ఈరోజు ఎంతో మంది తల్లులు పెద్దకష్టం నుంచి బయటపడ్డారు. లేదంటే..మాటిమాటికి పిల్లాడిని క్లీన్ చేసుకోవడమే అయ్యేది. ఈరోజు మనం డైపర్ కనిపెట్టిన మహిళ గురించి తెలుసుకుందాం.
పసిబిడ్డ ఏడుపుని బట్టి సమస్య ఏంటి అనేది డాక్టర్ తర్వాత చెప్పగలగేది తల్లే..ఆమెకు మాత్రమే బిడ్డకు వచ్చిన కష్టం ఏంటనేది తెలుస్తుంది. డోనోవన్ కూడా అంతే. మాటిమాటికీ తడిసే లంగోటా తన పాపాయికి ఇబ్బంది కలిగించడం ఆమె గమనించారు. దాన్ని దూరం చేయడానికి ఆవిడ చేసిన ప్రయత్నమే ఇప్పుడు మన పిల్లలకు వాడుతున్న డైపర్. దీని తయారీకి ఆమె షవర్ కర్టెన్‌ను ఎంచుకున్నారు. దానికి అడుగున చుట్టూ పాస్టిక్ కాగితాన్ని కలుపుతూ రూపొందించి, దానికి బోటర్ అని పేరు పెట్టారు. డోనోవన్‌ది అమెరికా. పూర్తిపేరు.. మరియన్ ఓ బ్రియన్ డోనోవన్.
చిన్నప్పుడే తల్లిని కోల్పోయారు. నాన్న ఇంజినీర్. ఆయన్ని చూస్తూ పెరిగిన డోనోవన్‌కు ఆవిష్కరణల పట్ల ఆసక్తి ఎక్కువ ఉండేది. బాల్యంలోనే తండ్రి సాయంతో కొత్త రకం పళ్ల పొడిని కనుక్కున్నారు. యేల్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్స్ పూర్తి చేశారు. ప్రముఖ పత్రికల్లో బ్యూటీ ఎడిటర్‌గా కూడా పనిచేశారు. వ్యాపారవేత్త. ఆమె ఆవిష్కరణల్లో దాదాపు 20 పేటెంట్ హక్కులు పొందాయి.
పునర్వినియోగించే లీక్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ డైపర్‌ను ఆమె పరిశోధనల్లో ఉత్తమమైందిగా చెప్తారు.. దీన్ని ఆమె 1946లో తయారుచేశారు. ఇదే తర్వాత డిస్పోజబుల్ పేపర్ డైపర్ కనిపెట్టడానికి దారి తీసింది. ప్యాంపర్స్ (డైపర్స్) సృష్టికర్త విక్టర్ మిల్స్ దీన్ని వాణిజ్యీకరించారుట.