ఈ రాశి వాళ్ళు ఎక్కువగా అబద్ధాలు చెబుతారు తెలుసా.?

నిజంగా మనం కొంతమందితో మాట్లాడితే వాళ్లు అబద్ధం ఆడినట్టు మనకు తెలిసిపోతుంది. అయితే పూర్తిగా ప్రతి ఒక్కరు నిజాయితీగా ఉండడం అసాధ్యమని చెప్పొచ్చు. అయితే అందరి ప్రవర్తన ఒకేలా ఉండదు. అయితే ఏ రాశి వాళ్ళు ఎలా ఉంటారు..?, ఎప్పుడు అబద్ధాలు చెప్తారు అనేది మనం చూద్దాం.

horoscope

కుంభరాశి:

కుంభ రాశి వాళ్లు ఎంత అబద్ధం చెప్తారు అంటే ఒక కథలా చెప్పేస్తారు. అయితే ఎదుటి వాళ్ళని వీళ్ళు ఫుల్ గా నమ్మించేస్తారు. వీళ్ళు అబద్ధం చెబుతున్నారు అని ఎటువంటి సందేహం ఇతరులకి కలగదు,

మేష రాశి:

మేష రాశి వాళ్లు అబద్ధాలని చాలా తక్కువగా చెబుతారు. అయితే ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంలో అబద్ధం చెప్పాల్సి వస్తే వాళ్లని తప్పించుకుని తిరుగుతూ ఉంటారు.

కర్కాటక రాశి:

ఈ రాశి వాళ్ళు అబద్ధాలని చెప్పడానికి వెనుకాడరు. సూటిగా కళ్ళలోకి చూస్తూ అబద్ధాలని చెప్పేస్తారు.

మకర రాశి:

వీళ్ళు అబద్దం ఎలా చెబుతారు అంటే నిజం చెప్పట్లేదు అని అవతల వాళ్ళకి తేలికగా తెలిసిపోతుంది. అలా ఉంటుంది మేషరాశి వాళ్ళ అబద్ధం.

సింహరాశి:

ఎదుటి వాళ్ళు అబద్దం చెబితే వీళ్ళు సహించలేరు. అదేవిధంగా ఒకవేళ వీళ్ళు పొరపాటున అబద్ధం చెప్తే చాలా గిల్టీగా ఫీలవుతారు.

మిధున రాశి:

ఈ రాశి వాళ్ళు చక్కగా అబద్ధాలని చెప్పగలరు. నిజంగా వీళ్లు అబద్ధం చెప్పడం లో ఆరితేరి పోయారు అని చెప్పవచ్చు.

తులారాశి :

నిజాయితీగా ఉండలేక పోయినందుకు ఈ రాశి వాళ్లు తర్వాత బాధపడుతూ ఉంటారు. అందుకని అబద్ధం చెప్పిన తర్వాత ఎవరికీ కనబడకుండా తిరుగుతారు.

ధనస్సు రాశి:

వీళ్ళకి అబద్ధం చెప్పడం అస్సలు ఇష్టం ఉండదు. ఎంతో నిజాయితీగా ఉంటారు.

వృశ్చిక రాశి:

ఈ రాశి వాళ్లు కూడా చక్కగా అబద్ధాలని చెప్పగలరు. ఎవరికి ఏ మాత్రం దొరికిపోరు.

వృషభ రాశి:

ఏదైనా పరిస్థితుల నుండి బయట పడాలంటే ఈ రాశివారు అబద్ధాలని చెప్పి తప్పించుకుంటారు.

కన్యారాశి:

ఈ రాశి వాళ్ళు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు అందుకని అబద్ధాలు చెప్పే పరిస్థితి వస్తే అబద్ధాలు చెప్పకుండా పారిపోతారు.

మీనరాశి:

వీళ్ళు చాలా నైపుణ్యంతో అబద్ధం చెబుతారు లేదు అంటే అబద్దం చెప్తున్నట్లు ఈజీగా తెలిసిపోతుంది.