మోదీ పుట్టినరోజు కానుకగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్.. నేటి నుండి మొదలు

-

భారత ప్రధాని నరేంద్ర మోదీ 71వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ శుక్రవారం రోజున నరేంద్రమోదీ పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల నుండి సామాన్యుల వరకు ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఐతే మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య శాఖ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనుంది. సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 7వ తేదీ వరకు మొత్తం 20రోజుల పాటు ఈ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగనుంది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్ మాండవియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అతి పెద్ద వ్యాక్సినేషన్ డైవ్ లో అందరికీ వ్యాక్సిన్ అందించి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు బహుమానాన్ని అందించాలని కోరారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ తో పాటు దాదాపు 140మిలియన్ల మందికి రేషన్ బ్యాగులు ఇవ్వనున్నారు. అలాగే 50మిలియన్ల బీజేపీ వర్కర్లకు పోస్టుకార్డులు పంపనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news