మోడీ బర్త్ డే..పవన్ ఆసక్తికర ట్వీట్.. !

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 71 వ పుట్టిన రోజును జరుపుకుంటున్న మోడీకి బిజేపి నేతలు, సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకంక్షలు చెబుతున్నారు. కాగా తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మోడీ కి పుట్టిన రోజు శుభాాంక్షలు చెబుతూ ఆసక్తికర పోస్ట్ చేశారు. “మోడీకి ఆయురారోగ్యాలతో కూడిన చిరాయువును ఆ ఆది పరాశక్తి ప్రసాదించాలి. ప్రకాశం జిల్లాలో విమానాలు అత్వసరంగా దిగేలా రోడ్లను నిర్మించడం అభినందనీయం.

ప్రకృతి వైపరీత్యాలలో ప్రజలను ఆదుకోవడానికి ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన కు అభినందనలు. ఈ ప్రాజెక్టును ఏపిలో అమలు చేస్తున్నందుకు అభినందనలు.” అంటూ పవన్ కల్యాణ్ మోడీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే మోడీ మరియు పవన్ కళ్యాణ్ ల మధ్య సత్సంబధాలు ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మోడీని ఎంతగానో అభిమానిస్తారు. అంతే కాకుండా జీహెచ్ ఎంసి ఎన్నికల్లో పవన్ బిజేపి కి సపోర్ట్ చేశారు.