జగన్ నీతిపరుడా… బాబు అసమర్ధుడా?

-

2014 ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు, చంద్రబాబు చేసినది ప్రధానంగా ఒకటే విమర్శ! వైఎస్ జగన్ లక్షకోట్లు తిన్నాడని, తాము అధికారంలోకి వస్తే అవన్నీ కక్కించి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయిస్తామని. కానీ కాంగ్రెస్ హయాంలో 16నెలలు జైల్లో ఉండటం తప్ప.. టీడీపీ ప్రభుత్వం జగన్ పై తీసుకున్న చర్యలేమీ లేవు. అంటే… జగన్ తప్పుచేయలేదని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లా లేక తాము అసమర్ధులమని ఒప్పుకున్నట్లా? బాబు & కో లకే తెలియాలి.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో కాకపోయినా, కనీసం బీజేపీతో దోస్తీ కట్టిన నాలుగేళ్లలో అయినా జగన్ – విజయసాయి రెడ్డిల సీబీఐ కేసుల విషయంలో ఎలాంటి ప్రగతి లేని సంగతి తెలిసిందే. దానర్ధం… జగన్ అవినీతి, లక్ష కోట్లు అనే మాటలు నాడు కాంగ్రెస్ కు కక్ష సాధించడానికి.. తర్వాత టీడీపీకి 2014లో ఎన్నికల సమయంలో విమర్శలు చేయడానికి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందడానికి మాత్రమే పనికొచ్చింది కానీ… జగన్ నిజంగా అవినీతి చేశాడు అని నిరూపించడానికి మాత్రం రాలేదు. దాంతో 2019 ఎన్నికల్లో జనాలు కూడా జగన్ అవినీతి చేశాడన్న ఆలోచనే మదిలోకి రానియ్యలేదు! ఫలితం 151!

అలా కాకుండా… 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే నిజంగా జగన్ అవినీతి చేసినట్లు ఆయన దగ్గర ఆధారాలు ఉంటే, కనీసం కేంద్రంలోని బీజేపీతో దోస్తీ సమయంలో అయినా ఆ ధైర్యం చేసి ఉంటే జనాలు కచ్చితంగా జగన్ కు ఈస్థాయి మెజారిటీ అయితే ఇచ్చేవారు కాదేమో! కానీ… జగన్ పై తాను చేసినవి అన్నీ రాజకీయ విమర్శలు మాత్రమే తప్ప… మరొకటి కాదని చంద్రబాబు చాలా క్లియర్ గా చెప్పినట్లయ్యింది!

నిజంగా జగన్ అవినీతి చేసి ఉంటే… టీడీపీ అంత సులువుగా వదిలేది కాదు. జగన్ నిజంగా అవినీతి చేసి ఉంటే… అరెస్టులూ తప్పేవి కావు! దానివల్ల జగన్ కు జరిగే డ్యామేజీ సంగతి కాసేపు పక్కన పెడితే… చంద్రబాబుకే మరింత క్రెడిబిలిటీ పేరిగేది. కానీ.. బాబు ఆపని చేయలేకపోయారు! దీంతో జగన్ అవినీతి చేసిన నోటితోనే… తాను అసమర్ధుడిని అనో, జగన్ అవినీతి చేయలేదనో చెప్పకనే చెప్పినట్లయ్యింది! ఈ క్రమంలో నాడు చంద్రబాబు.. జగన్ పై ఏ అవినీతి ఆరోపణలు చేశారో… అదే స్థాయిలో జగన్ కూడా 2019 ఎన్నికల సమయంలో అలానే అవినీతి ఆరోపణలు చేశారు. కాకపోతే.. బాబు మాటలకు, ఆరోపణలకు పరిమితమైతే… జగన్ చేతల్లో చూపిస్తున్నారు.

ఆరోపణలు చేయడానికేముందు… వినేవారు నలుగురు, చూపించేవారు ఇద్దరు ఉంటేచాలు. కానీ నిరూపించాలంటే… అక్కడ అవినీతి జరిగి ఉండాలి, కేసులు వేయగల ధమ్ముండాలి, ప్రజాధనం అంటే గౌరవం ఉండాలి! మాటకు కట్టుబడి పాలన చేయాలంటే.. ముందుగా ఆ వ్యక్తికి చిత్తశుద్ధి ఉండాలి.. కదా!

Read more RELATED
Recommended to you

Latest news