చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో వింతశబ్దాలు… భయంతో పరుగులు తీసిన గ్రామస్తులు..!

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తుంబ వారి పల్లి లో వింత శబ్దాలు వినిపించ‌డం క‌ల‌క‌లం రేపింది. వింత శ‌బ్దాల వ‌ల్ల‌ భయంతో గ్రామ‌స్తులు పరుగులు తీశారు. రాత్రంతా ఇళ్ల బయ‌టే జాగారం చేశారు. భూకంపం వచ్చిందంటూ ఇళ్ల నుంచి గ్రామ‌స్థులు ప‌రుగులు తీశారు. అది భూకంపం కాదని భూమి లోపల నుంచి వస్తున్న వింత శబ్దాలని అధికారులు గుర్తించారు. గ్రామం రెండు ఎత్తున కొండల మధ్య ఉండడం …గతంలో వందల సంఖ్యలో బోర్లు వేసి నీళ్లు పడకపోవడం ప్రస్తుతం భారీ వర్షాలకు ఆ బోర్లోకి నీరు చేరడం వంటి పరిణామాలతో వింత శబ్దాలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

దీనికి తోడు భూమి లోపల కాళీ పొరలు ఏర్పడి ప్రస్తుతం వర్షపునీరు చేరడం తో వింత శబ్దాలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక గ్రామంలో వింత శ‌బ్దాలు రావ‌డంతో అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. భూకంపం వ‌స్తంద‌ని కొంద‌రు…ద‌య్యాల కార‌ణంగానే వింత శ‌బ్దాల‌ని మ‌రికొంద‌రు పుకార్లు మొద‌లు పెట్టారు. దాంతో గ్రామంలో భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెల‌కొంది.