నర్సాపూర్ పంచాయితీ..’కారు’ ఇరుక్కునట్లే!

-

తెలంగాణలో ఎక్కడకక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు నడుస్తున్న విషయం తెలిసిందే..చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలకే పొసగని పరిస్తితి. ఎవరికి వారు సెపరేట్ గా గ్రూపు రాజకీయాలు నడుపుతుండటంతో పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ వీక్ అవుతూ వస్తుంది. ఇప్పటికే నేతల మధ్య పోరు వల్ల పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ బలం తగ్గిందనే చెప్పాలి.

ఇదే క్రమంలో నర్సాపూర్ లో సైతం టీఆర్ఎస్ నేతల మధ్య పోరు నడుస్తోంది…దీంతో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి కష్టాలు పెరిగాయి. మామూలుగా నర్సాపూర్..మొదట నుంచి కాంగ్రెస్, సి‌పి‌ఐ పార్టీలకు కంచుకోటగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్, సి‌పి‌ఐ పార్టీలు మెజారిటీ సార్లు గెలిచాయి. కొన్ని సార్లు టీడీపీ పొత్తులో భాగంగా సి‌పి‌ఐ..నర్సాపూర్ లో గెలిచింది. కాంగ్రెస్ సైతం మంచి విజయాలు సాధించింది.

అయితే 1999 ఎన్నికల నుంచి సునీతా లక్ష్మారెడ్డి హవా నడుస్తోంది…1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2014, 2018 ఎన్నికల్లో ఆమె టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. టీఆర్ఎస్ నుంచి చిలుముల మదన్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. 2018 వరకు నర్సాపూర్ టీఆర్ఎస్ లో ఎలాంటి పంచాయితే లేదు…కానీ ఎప్పుడైతే సునీతా కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్ లో చేరారో అప్పటినుంచి కారులో పంచాయితీ మొదలైంది.

నర్సాపూర్ లో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది…ఎవరికి వారే సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తమదంటే తమదని ప్రకటించుకుంటున్నారు. మూడోసారి టికెట్ దక్కించుకుని సత్తా చాటాలని మదన్ రెడ్డి…ఎలాగైనా టికెట్ సాధించి..గెలవాలని సునీతా ట్రై చేస్తూనే ఉన్నారు.

ఈ సీటు పంచాయితీ విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం సైతం క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ నెక్స్ట్ ఒకరికి టికెట్ ఇస్తే..మరొకరు సహకరించే పరిస్తితి లేదు…చివరికి నర్సాపూర్ లో టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news