పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఇంతకు ముందు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్, 1995 కిందనున్న పెన్షనర్లు ప్రతీ ఏడాదికి ఒకసారి జీవన్ ప్రమాణ్ లేదా లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చెయ్యాలి. పెన్షన్ క్రెడిట్ అయ్యే బ్యాంకులు, పోస్టాఫీసులు చోట లైఫ్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చెయ్యాలి.
అంత కంటే ముందు వుండే పెన్షనర్లు సబ్మిట్ చేసే ఏజెన్సీల వద్దకు వెళ్లి దీన్ని సబ్మిట్ చేసేవారు. అయితే ఒకవేళ దీన్ని తీసుకోలేకపోతే… పెన్షనర్లకి ఈజీ చేసేందుకు లైఫ్ సర్టిఫికేట్ ప్రాసెస్‌ను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈజీ చేసింది. దీనితో రిలీఫ్ కలగనుంది.
పెన్షనర్లకు మొబైల్ యాప్ ని లాంచ్ చేసారు. పూర్తి వివరాలను చూస్తే.. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను యాప్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు. ఏ సమయంలో అయినా సరే దీన్ని సబ్మిట్ చేసేలా చేసింది. ఈ విషయం ట్విటర్ అకౌంట్ ద్వారా ఈపీఎఫ్ఓ తెలిపింది. ఆధార్ ఫేస్ఆర్డీ యాప్‌ను డౌన్ లోడ్ చేసి ఈ సేవలను పొందొచ్చు. బయోమెట్రిక్స్‌ను సబ్మిట్ చేసేటప్పుడు ఇబ్బందులు పడే పెన్షనర్లకు ఇది బాగుంటుంది.
లైఫ్ సర్టిఫికేట్ ని ఎలా సబ్మిట్ చేసుకోవాలి..?
దీని కోసం మొదట మీరు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి.. ఆధార్ ఫేస్ఆర్డీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
తరవాత ఆపరేటర్ అథెంటికేషన్‌పై నొక్కండి. పెన్షనర్ల అథెంటికేషన్ మీద క్లిక్ చేయండి.
తరవాత మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పీపీఓ నెంబర్ ని ఎంటర్ చేసేయండి.
తరవాత మీరు ఫేస్ ని స్కాన్ చేసి ఎంటర్ చెయ్యండి.
అప్రూవల్ అయితే అప్‌డేట్ అయినట్టు.
రిజక్ట్ అయితే ఎస్ఎంఎస్ వస్తుంది అంతే.