జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఎప్పటికప్పుడు వైసీపీ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. తనదైన శైలిలో వైసీపీకి కౌంటర్లు ఇస్తున్నారు. అయితే పవన్‌కు చెక్ పెట్టడానికి వైసీపీ నుంచి కాపు నేతలు ఎంట్రీ ఇచ్చి..పవన్‌పై విమర్శలు చేస్తున్నారు. గత మూడేళ్లుగా ఇదే జరుగుతుంది. ముఖ్యంగా పేర్ని నాని…పవన్ టార్గెట్‌గా విమర్శలు చేస్తూనే ఉంటారు.
మంత్రి పదవి ఉన్నప్పుడు అంతే..లేనప్పుడు కూడా అంతే. పవన్ టార్గెట్‌గానే పేర్ని విమర్శలు ఉంటాయి. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే..పవన్‌కు చెక్ పెట్టాలంటే చిరంజీవిని పొగుడుతూ..పవన్‌ని తిట్టడం చేస్తున్నారు. ఇలా చేయడం వెనుక పెద్ద కాన్సెప్ట్ ఉందని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కాపు ఓటర్లు మెజారిటీ సంఖ్యలో వైసీపీకి మద్ధతు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్తితి మారుతూ వస్తుంది. కాపులు పెద్ద సంఖ్యలో పవనకు సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే టీడీపీ కూడా కాపుల మద్ధతుగా నిలుస్తున్నారు.
అంటే ఇక్కడ కాపుల మద్ధతు వైసీపీకి తగ్గుతుంది. అందుకే వైసీపీ చిరంజీవి పేరుని తీసుకొస్తుంది. పవన్ వల్ల పోయే ఓట్లు చిరంజీవి వల్ల వస్తాయని చెప్పి..వైసీపీ ఈ తరహాలో రాజకీయం నడిపిస్తోంది. తాజాగా ప్రజారాజ్యం పార్టీ మూసివేయడం వెనుక ఉన్న కారణాలని పవన్ చెప్పుకొచ్చి..జనసేనని ఎట్టి పరిస్తితుల్లో విలీనం చేయనని చెప్పారు. అలాగే ఎప్పటిలాగానే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
దీనికి కౌంటర్ గా పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి..పవన్ పై ఫైర్ అయ్యారు. చిరంజీవి పార్టీ పెట్టి పోరాటం చేశారని, 18 సీట్లు గెలిచారని, కానీ చిరంజీవి తప్పులు చేసినట్లు పవన్ మాట్లాడుతున్నారని, ప్రజారాజ్యం ఓడిపోయాక పవన్ పారిపోయారని, సొంత అన్నకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి పవన్ అని పేర్ని విమర్శించారు. అయితే ఇందులో పూర్తిగా రాజకీయం కనబడుతోంది.
ప్రజారాజ్యం విషయంలో చిరంజీవి కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవం. వాటినే పవన్ ప్రస్తావిస్తూ..తాను జనసేన విషయంలో ఆ తప్పులు చేయనని చెబుతున్నారు. కానీ పేర్ని మాత్రం పవన్..చిరంజీవికి వెన్నుపోటు పొడిచారని విమర్శలు చేస్తున్నారు. అంటే పవన్ వల్ల పోయే కాపు ఓట్లు చిరంజీవిని పొగిడి రాబట్టాలని, అలాగే చిరంజీవికి పవన్ వెన్నుపోటు పొడిచారని చెప్పి కాపుల్లో పవన్ పట్ల యాంటీ వచ్చేలా చేయాలని చూస్తున్నారు. కానీ వైసీపీ ఎత్తులు ఫలిచేలా లేవు. ప్రస్తుతం రాజకీయాల్లో చిరంజీవి ప్రభావం పెద్దగా లేదు. ఆయనని పొగిడి, పవన్‌ని తిడితే కాపుల ఓట్లు వచ్చేస్తాయని అనుకోవడం అవివేకమే అవుతుంది.