మళ్ళీ పెళ్లి చేసుకోనున్న దిల్ రాజు…!

-

టాలివుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లీడింగ్ సిని పంపిణి దారుగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు అందరు హీరోలతో ఆయన సినిమాలు చేసారు. హిట్ సినిమాలే దిల్ రాజు కెరీర్ లో ఎక్కువగా ఉంటాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు దిల్ రాజు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది.

ఆయన రెండో పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆయన భార్య అనిత మూడేళ్ళ క్రితం అనారోగ్యం కారణంగా మరణించారు. అప్పటి నుంచి దిల్ రాజు ఒంటరిగానే ఉంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారట. ఈ విషయం ఆయన సన్నిహితులకు మాత్రమే తెలుసనీ టాలివుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.

బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తితో ఆయన వివాహం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఆయనకు ఉన్న ఏకైక కుమార్తెకు గత ఏడాది వివాహం కూడా అయిపోయింది . ప్రస్తుతం తోడు లేక ఇబ్బంది పడుతున్న దిల్ రాజు వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో పింక్, నానీ తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ రెండు వేసవిలో ప్రేక్షకుల ముందుకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news