స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కు దారుణ మైన దెబ్బ పడబోతుందా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఎన్నిరోజులగా కోలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న దిల్ రాజు స్టార్ హీరో దళపతి విజయ్ డేట్స్ సంపాదించి , మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని తో తమిళ్ లో వారీసు గా తెలుగు లో వారసుడుగా అత్యంత భారీ స్థాయిలో సినిమా నిర్మిస్తున్నారు.రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.
- హీరో విజయ్ కి వున్న రెండు రాష్ట్రాల్లో వున్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తెలుగు తమిళ భాషల్లో సంక్రాంతికి కానుక గా జనవరి 12న విడుదల చేస్తున్నట్టుగా ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ డేట్ ని ప్రకటించేసింది. ఇప్పటికే సినిమా ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దిల్ రాజు కూడా తన పద్దతికి విరుద్ధంగా సినిమా కోసం భారీగా ఖర్చు పెడుతున్నారట.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు కోలీవుడ్ లో ఇబ్బందులు ఎదురు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కోలీవుడ్ లో విజయ్ `వారీసు` రిలీజ్ కానున్న జనవరి 12నే తల అజిత్ నటిస్తున్న `తునీవు` కూడా రిలీజ్ కాబోతోందట. ఆ సినిమా నిర్మాత కూడా అదే డేట్ అని ఫిక్స్ అయ్యారట. అదీ కాకుండా ప్రస్తుతం అధికారం లో వున్న వారి బంధువు అయిన ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు అంతటా తన బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నాడు. దీనితో విజయ్ సినిమా కు ఎక్కువ థియేటర్స్ లభించే అవకాశం కనపడటం లేదు. ఇది వసూళ్ల పై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.