పురుషులకు ప్రకృతి ప్రసాదించిన వరం..శిలాజిత్తు.. ఆ సమస్య ఉంటే వాడేయండి..!

-

శిలాజిత్ అనే పేరు కూడా చాలా మంది విని ఉండరు..ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో దీనికి మంచి ప్రాముఖ్యత ఉంది. పురుషుల హార్మోన్లను ప్రోత్సహిస్తుంది. లైంగిక సమస్యలతో సహా అనేక వ్యాధుల నిర్మూల‌న‌కు శిలాజిత్ ఎంతోగానో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఇది హిమాలయ పర్వతాలలో కనిపించే సహజసిద్ధమైన నల్ల రంగు ఖనిజం. ఈరోజు దీని విశిష్టత గురించి తెలుసుకుందాం..!
శిలాజిత్ అనేది మందపాటి గోధుమరంగు, జిగట పదార్థం, ఇది ప్రధానంగా హిమాలయాల శిలల నుంచి తీసుకొస్తుంటారు. తెలుపు రంగు నుంచి ముదురు గోధుమ రంగుల్లో ఉంటుంది. శిలాజిత్ సాధారణంగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడుతుంది.
 భారత్, నేపాల్, పాకిస్తాన్, టిబెట్ వంటి ఏడు దేశాలలో విస్తరించి ఉన్న హిమాలయ పర్వతాల్లో ఇది దొరుకుతుంది. మే, జూన్‌ నెలల్లో మండే వేడి నుంచి షిలాజిత్ బయటకు వస్తుంది.శిలాజిత్ ఒక ఆయుర్వేద మూలిక, ఇది పురుషుల అనేక సమస్యలను అధిగమించడానికి ఉపయోగించబడుతుంది. ఇది పురుషులలో సంతానలేమి సమస్యను సైతం దూరం చేస్తుంది.

పురుషులకు శిలాజిత్ వల్ల కలిగే ప్రయోజనాలు..

శిలాజిత్ తీసుకోవడం ద్వారా పురుషుల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.
పురుషులలో వంధ్యత్వానికి సంబంధించిన సమస్యను అధిగమించడానికి, శిలాజిత్ తినొచ్చు.
పురుషుల గుండె ఆరోగ్యానికి శిలాజిత్ చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది.
శిలాజిత్ తీసుకోవడం ద్వారా పురుష హార్మోన్ అంటే టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచవచ్చు.
శిలాజిత్‌ను రోజూ తీసుకోవడం వల్ల పురుషుల కండరాలు మెరుగైన రీతిలో అభివృద్ధి చెందుతాయట.
శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, పురుషులు షిలాజిత్ తినొచ్చు.
ఆయుర్వేదం ప్రకారం, ఆవు పాలతో కలిపి శిలాజిత్‌ను తీసుకోవాలని చెబుతారు. దీంతో సంతానలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు.
శిలాజిత్తును వాడ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. ర‌క్త హీన‌త స‌మ‌స్య నుంచి బ‌యట ప‌డ‌వ‌చ్చు. అల్జీమ‌ర్స్ వ్యాధిని శిలాజిత్తు త‌గ్గిస్తుంది. గ‌ర్భిణీలు, కీళ్ల నొప్పులు ఉన్న‌వారు, గౌట్ స‌మ‌స్య ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు శిలాజిత్తును వాడుకోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news