ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు దిల్ రాజు తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం కు వచ్చారు.. ఈ సందర్భంగా తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్న ఆయన తన రెండో పెళ్లి గురించి దాని వెనుక ఉన్న అసలు కథను చెప్పుకొచ్చారు..
ప్రముఖటాలీవుడ్ దర్శకుడు దిల్ రాజు 2020 డిసెంబర్ లో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే అయితే లాక్ డౌన్ కారణంగా నిబంధనలను ఈ పెళ్లి జరిగింది 49 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకోవడం విశేషంగా మారింది.. అయితే అప్పట్లో ఈ పెళ్లి వైరల్ గా మారింది అసలు దిల్ రోజు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు అనే విషయం అందరూ చర్చించుకునేలా మారింది అయితే తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో అసలు విషయాలు చెప్పకు వచ్చారు దిల్ రాజు..
‘‘నా భార్య అనిత చనిపోయే సమయానికి నాకు 47 ఏళ్లు. నేను పక్కా ఫ్యామిలీ మ్యాన్‌ని. ఉన్నట్లుండి భార్యను కోల్పోవడంతో ఎమోషనల్‌గా గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. నేను రోజంతా ఎక్కడ ఉన్నా సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తా. పక్కా ఫ్యామిలీ మ్యాన్ అయిపోతా. అలాంటిది హఠాత్తుగా భార్యను కోల్పోవడంతో ఇంట్లో పరిస్తితి చాలా ఇబ్బందికరంగా మారింది. రెండేళ్ల పాటు ఆ బాధలోనే ఉండిపోయాను.
భార్య మరణించాక రెండేళ్లు నా కూతురు, అల్లుడు నా ఇంట్లోనే ఉన్నారు. అయినా సరే లోటు తీరలేదు. అప్పుడు నాకు మళ్లీ పెళ్లి చేయాలని మా అమ్మా నాన్నా ఆలోచించారు. నా కూతురు కూడా అదే అనుకుంది. నా క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు కూడా నన్ను ఆ దిశగా పుష్ చేశారు. అప్పుడు ఆప్షన్లు చూశాం. వేరే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను కూడా పరిశీలించాం. వైదా నాకు కరెక్ట్ అనిపించింది. అంతకుముందు తనతో పరిచయం లేదు.
అయితే నాతో పెళ్లి అంటే ఆమెకు పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. సెలబ్రెటీ అంటే ప్లస్సులుంటాయి. మైనస్‌లు ఉంటాయి. సినిమాలు, ఫ్యామిలీ.. ఇలా అన్ని విషయాలు తనతో మాట్లాడాక, అంతా బావుంది అనుకున్నాక పెళ్లికి రెడీ అయ్యాం. తర్వాత నాకు బిడ్డ పుట్టాడు. నా మొదటి భార్య అనిత, రెండో భార్య వైదా పేర్లు కలిసొచ్చేలా వాడికి ‘అన్వయ్’ అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉంది’’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు..