వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరియర్ లో ఫస్ట్ టైం బౌలింగ్ చేశాడు. ఆసియా కప్ 2022 సూపర్-4 లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్ ని దినేష్ కార్తీక్ తో భారత తాత్కాలిక కెప్టెన్ కే ఎల్ రాహుల్ బౌలింగ్ చేయించాడు. చాలా స్లో రణపు తో స్పిన్ బౌలింగ్ చేసిన దినేష్ కార్తీక్ ఓవర్ లో 18 పరుగులు సమర్పించుకున్నాడు.
మ్యాచ్ లో భారత్ జట్టు 101 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారత జట్టులోకి 2004లో ఎంట్రీ ఇచ్చిన దినేష్ కార్తీక్ ఈ 18 ఏళ్లలో 26 టెస్టులు, 94 వన్డేలు, 50 టీ 20 మ్యాచ్ లు అలానే ఐపిఎల్ లోనూ ఈ వికెట్ కీపర్ కం బ్యాటర్ 229 మ్యాచ్లు ఆడాడు.
కానీ ఈ సుదీర్ఘ కెరియర్ లో కనీసం ఒక్కసారి కూడా అతను బౌలింగ్ చేయలేదు. ఏ కెప్టెన్ కూడా అతనితో బౌలింగ్ చేయించాలని అనుకోలేదు. దానికి కారణం వికెట్ కీపర్ గా అతనిపై ముద్ర పడిపోవడమే. కానీ గత మూడేళ్లలో అతను ఆ ముద్ర నుంచి బయటపడ్డాడు. కేవలం వికెట్ కీపర్ గానే కాకుండా ఫీల్డర్ గా, టాప్ ఆర్డర్ గా, బ్యాటర్ గా, ఫినిషర్ గా ఇలా టీం ఏ రోల్ ఇచ్చిన రెడీ అంటూ కెరియర్ ని మలచుకున్నాడు.
India vs Afghanistan #AsiaCup2022 #DineshKarthik bowling pic.twitter.com/PEo8lxmuaw
— Deepak Dagar (@deepak123dagar) September 8, 2022