రజనీకాంత్​ ఆఫర్​ను రిజెక్ట్​ చేసిన మణిరత్నం​.. కారణం ఏంటో తెలిస్తే షాక్!

-

సాధారణంగా రజనీకాంత్​ తమ చిత్రంలో నటిస్తానంటే ఏ దర్శకుడైనా కాదనకుండా పాత్ర ఇస్తారు. అలాంటి ఆయన్ను దర్శకుడు మణిరత్నం​ రిజెక్ట్​ చేశారట. ఎందుకంటే?

దిగ్గజ దర్శకుడు తెరకెక్కించిన భారీ బడ్జెట్​ సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. చోళుల స్వర్ణయుగాన్ని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు. ఆయన కలల చిత్రంగా ఇది సిద్ధమవుతోంది. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్‌ సెల్వన్‌ నవల ఆధారంగా రూపొందించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం చెన్నైలో వేడుకగా జరిగింది. అగ్రనటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ.. “గతంలో ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత ‘ప్నొనియిన్‌ సెల్వన్‌’లోని వంతియాతివన్‌ (కార్తి పోషించిన పాత్ర)కు నేను చక్కగా నప్పుతానని చెప్పారు. ఆమె చెప్పిన మాటతోనే నేను ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పుస్తకం చదివి.. రచయిత కల్కి ఇంటికి వెళ్లి పాదాలకు నమస్కారం చేశా. ఇదొక అద్భుతమైన కథ. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనేది అరుల్‌ మొళివర్మన్‌ కథ కాదు. నందిని (ఐశ్వర్యా రాయ్‌ పోషించిన పాత్ర) కథ. ఇప్పుడున్న రోజుల్లో నందిని పాత్రను ఎవరూ చూసి ఉండరు.

‘నరసింహ’లో నీలాంబరి పాత్రకు నందిని పాత్రే స్ఫూర్తి. పొన్నియిన్‌ సెల్వన్‌’ కథ చదివిన తర్వాత అరుణ్‌ మొళివర్మన్‌ (జయం రవి‌) పాత్రలో కమల్‌ హాసన్‌, కుండవై (త్రిష) పాత్రలో శ్రీదేవి, ఆదిత్య కరికాలన్‌ (విక్రమ్‌) గా విజయ్‌ కాంత్‌ని ఊహించుకున్నా. ఈ సినిమాలో నాక్కూడా భాగం కావాలనిపించింది. మణిరత్నంని కలిసి పళు వెట్టరైయార్‌ పాత్రలో నటిస్తానని అడిగా. ‘మణి.. చిన్న పాత్ర అయినా పర్వాలేదు. నేను చేస్తా’ అని చెప్పా. దానికి ఆయన.. ‘మీ అభిమానులతో నన్ను తిట్టించాలనుకుంటున్నావా?’ అని అడిగారు. నేను తమ సినిమాలో నటిస్తానంటే వేరే ఎవరైనా సరేనని ఒప్పుకొనేవారు. కానీ, మణి మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. అదీ మణిరత్నం అంటే” అని రజనీ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news