దర్శకధీరుడు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు..!

-

తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయాలు ఎరుగని డైరెక్టర్ రాజమౌళి. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచదేశాలకు తెలిపిన దర్శక ధీరుడు. ఇక బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన శనివారం 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ ఓ స్పెషల్‌ పిక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో భాగంగా జక్కన్నతో కలిసి దిగిన ఓ ఫొటోని షేర్‌ చేసిన తారక్‌.. హ్యాపీ బర్త్‌డే జక్కన్న లవ్‌ యూ’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే ఇప్పటి వరకు రాజమౌళి 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన 13వ సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతున్నది. ఇక బాహుబలి సినిమా రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది.

రాజమౌళి పుట్టిన రోజు సందర్బంగా సినీ ప్రముఖులు అంత సోషల్ మీడియా వేదికగా శుభాకంక్షాలు తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్నందుకు నేనెంతో గౌరవంగా భావిస్తున్నానంటూ అజయ్‌ దేవగణ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇక , తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరెంతో పెంచాలని కోరుకుంటున్నా అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఇండియాలో ఉన్న అత్యున్నతమైన దర్శకుల్లో ఒకరైన రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ వెంకటేష్ విషెస్ తెలిపారు.

రాజమౌళి గొప్ప సంకల్పంతో మీ కలలను సాకారం చేసుకుని అద్భుతమైన విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు మీకు ఆయురారోగ్యాలు అందించాలని ప్రార్థిస్తున్నాను. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం అంటూ బాబీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించాలని భావిస్తున్నాను.

ముందు ముందు మీతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నానంటూ కాజల్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

మనం చేసే పనిలో విజయాలు సాధించాలంటే.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అస్సలు రాజీ పడొద్దనే విషయాన్ని నేను మీ దగ్గర నుంచే నేర్చుకున్నానంటూ అడవి శేషు రాజమౌళికి బర్త్ డే విషెస్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news