రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపైనే ప్రధాన మోడీతో చర్చించానని అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. అయితే అపాయింట్మెంట్ అడగ్గానే ఇచ్చినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు కోమటిరెడ్డి.
భువనగిరి పార్లమెంటు అభివృద్ధి అంశాలతో పాటు రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించాను అన్నారు. మూసి కలుషితం ఐ ప్రజలకు ప్రమాదకరంగా మారిందన్నారు. ” ముసిని ప్రక్షాళన చేయాలి. గతంలో సబర్మతి పరిస్థితి ఇలాగే ఉండేది. ఇప్పుడు ప్రక్షాళన చేశారు. గంగను క్లీన్ చేస్తున్నారు. మూసి వల్ల కోటి మందికి పైగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని విస్తరించారు.
హైదరాబాద్ నుంచి జనగామ వరకు ఎంఎంటిఎస్ రైల్ నడపాలని కోరాను. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ అడుగుతా. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల గతంలో సిఎస్ ను అడిగాను. భువనగిరి, జనగామ లను మోడల్ రైల్వే స్టేషన్లుగా మార్చాలి” అన్నారు కోమటిరెడ్డి. అయితే తెలంగాణలో సర్ప్లేస్ బడ్జెట్ ఉంది కదా అని మోడీ అడిగారని.. అన్నీ మీకు తెలుసు.. అలసిపోయి మీ వద్దకు వచ్చాను అని చేతులెత్తి విన్నవించానని తెలిపారు కోమటిరెడ్డి.