ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ రగడకు పులిస్టాప్ పడింది. శనివారం రాష్ట్ర ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో ఉద్యోగ సంఘాలు సమ్మె విరమిస్తామని ప్రకటించారు. కాగ నేటి నుంచి రాష్ట్రంలో అన్ని విభాగాల ఉద్యోగులు సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే సమ్మె జరగకుండా ఆపాలని.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని సీఎం జగన్ మంత్రుల కమిటీతో సమావేశం అయి ఆదేశించారు. దీంతో శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు పలు మార్లు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది.
కాగ ఉద్యోగ సంఘాల డిమాండ్లను పరిష్కరించడానికి తము అంగీకరించామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ అన్నారు. ఫిట్ మెంట్ 23 శాతం ఇస్తున్నామని అన్నారు. హెచ్ఆర్ఎ స్లాబుల్లో మార్పలు చేశామని అన్నారు. అలాగే ఐఆర్ రికవరీ ప్రతిపాధనను కూడా ఉపసంహరించుకుంటామని అన్నారు.
కాగ ఉద్యోగ సంఘాల నుంచి బండి శ్రీనివాస్, సూర్య నారాయణ స్పందింస్తు.. తమ డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం అంగీకరించాదని అన్నారు. అందుకే సమ్మె విరమిస్తున్నామని ప్రకటించారు. ఐదు డీఏలు ఒకే సారి విడుదల చేసి తమకు మేలు చేశారని.. అందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు అని అన్నారు. త్వరలోనే సీఎం జగన్ ను కలుస్తామని అన్నారు. కాగ ఉద్యమ సమయంలో తమ ఉద్యోగులు ఏమైనా అంటే పట్టించుకోవద్దని సీఎం జగన్ ను కోరుతామని తెలిపారు.