2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ లో పర్యటిస్తున్న డీకే అరుణ, అధికార టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. హామీలు, పథకాల అమలుపై మరోసారి, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ అబద్దాలు, హామీలను నమ్మరని.. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేయలేడని అన్నారు డీకే అరుణ. రాష్ట్రంలో 14 లక్షల మంది నిరుద్యోగులకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రజలను టీఆర్ఎస్ మోసం చేస్తుందని.. వడ్లు కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదని.. కేసీఆర్ కావాలని వరి ధాన్యంపై రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దళిత బంధు అమలు చేయాలని.. 2014 నుంచి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.