సుపారీ ఎపిసోడ్ అంతా చూస్తుంటే.. బీజేపీ నాయకులను కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉన్నారని బీజేపీ నేత డీకే అరుణ ఆరోపించారు. స్టీఫెన్ రవీంద్ర ఓ స్టోరీ క్రియేట్ చేసి.. ఓ స్క్రిప్ట్ ను చదువుతున్నట్లు ఉందని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ఆయన ముఖ్య అనుచరుడు శ్రీనివాస్ గౌడ్ క్రియేట్ చేసిన స్టోరీ అని ఆమె ఆరోపించారు. దీనిపై పూర్తిగా విచారణ చేయాలని.. ఈ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు టీఆర్ఎస్ చేతుల్లో కీలుబొమ్మలుగా మారారని ఆమె విమర్శించారు. మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ పై మాట్లాడితే కేసులు పెడుతున్నారని.. ఎలక్షన్ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని చాలా సార్ల శ్రీనివాస్ గౌడ్ బెదిరించాడని ఆమె ఆరోపించారు. రూ.15 కోట్లు సుపారీ ఇచ్చే శక్తి టీఆర్ఎస్ పార్టీకే ఉందని.. డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఈరోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకే డబ్బు ఉందని ఆమె అన్నారు. మంత్రిగారు ఎందుకు సైలెంట్ ఉంటున్నారని ప్రశ్నించారు. సీబీఐ ద్వారా ఈ కేసును విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. మాపై బురద జల్లితే చూస్తూ ఊరుకోం అని ఆమె హెచ్చరించారు.
రూ. 15 కోట్లు సుపారీ ఇచ్చే శక్తి టీఆర్ఎస్ నాయకులకే ఉంది… డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
-