సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన ఘటనకు తెరాస రాజకీయ వ్యూహకర్త అని చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోర్ కు సంబంధం ఉండచ్చని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అనుమానం వ్యక్తం చేసారు.
నిన్నటి ఘటన పై మాట్లాడిన dk అరుణ, నిన్న జరిగిన ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని, లేదంటే తాము కేంద్ర ప్రభుత్వాన్ని విచారణకు కోరుతామని డీకే అరుణ అన్నారు.
శాంతియుత నిరసనకు వచ్చిన వారిని ఓ గదిలో నిర్బంధించింది ఎవరు? , నిఘా విభాగం ఏమి చేస్తున్నట్లు, రైల్వే స్టేషన్ లోకి పెట్రోల్ బాటిల్స్ ఎలా వచ్చాయి? నిన్న జరిగిన ఘటన ముమ్మాటికీ ముంద్దస్తు వ్యూహం లో భాగంగానే జరిగిందని స్పష్టంగా కనిపిస్తుందని డీకే అరుణ అన్నారు. ఈ సంఘటనకు కారకులైన వారిని ప్రభుత్వం కఠిన శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.