మనకు లక్ష రూపాయలు రావాలి అంటే వంద సార్లు తిరిగినా ఇవ్వని బ్యాంకులు పెద్ద మనసు చేసుకుని వాయిదాలను… వాయిదా వేయడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేసారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈఎంఐ లను వాయిదా వేసుకోవాలని సూచించిన రోజుల వ్యవధిలో వాయిదా వేస్తున్నామని చెప్పాయి బ్యాంకులు. కాని ఇక్కడ తమ ఖాతాదారులకు చుక్కలు చూపించడం మొదలుపెట్టాయి.
అదేంటి అంటున్నారా…? ఒక వ్యక్తి విద్యా ఋణం తీసుకున్నాడు అనుకుందాం. అప్పుడు అతను తీసుకుంది రెండు లక్షలు. వాటికి వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం మూడు వేలు వాయిదా కడితే అందులో రెండు వేలు వడ్డీకే పోతుంది. అంటే వెయ్యి రూపాయలే అసలుకి జమ అవుతుంది. ఇక్కడ బ్యాంకులు ఈఎంఐలు వాయిదా అన్నాయి గాని… వడ్డీని కూడా వాయిదా వేస్తున్నామని చెప్పలేదు.
అంటే మూడు నెలలకు ఆరు వేలకు పైగా వడ్డీ పడుతుంది. అది కేవలం రెండు లక్షలకు మాత్రమే. అంటే పది లక్షలు, 20 లక్షలు, కోటి రూపాయలు వడ్డీ తీసుకున్న వాళ్ళు. గృహ రుణాలు తీసుకున్న వాళ్ళు, బయట పలు నాన్ బ్యాంకింగ్ సంస్థల్లో రుణాలు తీసుకున్న వాళ్లకు వడ్డీలు భారీగా పెరుగుతాయి.దీనితో వినియోగదారులకు ఆ భారం భారీగా పెరుగుతుంది. వడ్డీలు పెరిగిపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.