ఎర్ర జామపండుని తినటం ఇష్టంలేదా.. లాభాలు తెలిస్తే అసలు వదిలిపెట్టురుగా.!

-

పండ్లలో తక్కువ ధరకు వచ్చే వాటిలో జామకాయ ఒకటి. ఇంకా హెల్తీ కూడా. అయితే.. మనం ఎప్పుడు కొన్నా.. నార్మల్ గా లోపల వైట్ గా తియ్యగా ఉండేవే తీసుకుంటాం.. జామకాయలో కూడా మస్త్ టైప్స్ ఉంటాయి. అందులో ఒకటి రెడ్ కలర్లో ఉండేది. ఇది మనం చాలాసార్లు చూస్తాం.. కానీ పెద్దగా తినరు. టేస్ట్ నార్మల్ జామకాయతో పోలిస్తే కాస్త బాగుండదు. అసలు తియ్యగానే ఉండదు. ఒక టైప్ వగరుగా అనిపిస్తుంది. అందుకే ఇది తినడానికి ఎవరూ అంత ఇష్టపడరు. కానీ మీకు తెలుసా.. ఎర్రజామకాయ వల్ల చాలా లాభాలు ఉన్నాయని. అవేంటో మీరు చూడండి..!

ఎర్ర జామకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉన్న ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

జామపండులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోకి అన్ని భాగాలకు వ్యాపించి కండరాలకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాక..కండరాల తిమ్మిరి తగ్గించటమే కాకుండా ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుంది.

విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా బాడీని కాపాడుతుంది. విటమిన్‌ ఏ, ప్లేవనాయిడ్స్‌ పుష్కలంగా ఉండటం వల్ల లంగ్స్, చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

పచ్చి ఎర్ర జామకాయలో హైలెట్ ఎంటంటే…. క్రమం తప్పకుండా కానీ ఇది తిన్నారంటే.. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అసలే వచ్చేది ఎండాకాలం.. బాడీకి ఊరికే.. డీహెడ్రేట్ అవుతుంది. వాటర్ తాగితే.. పొట్టలో గడబిడ.. కాబట్టి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచే పండ్లు తినడం మేలు.. అందులో ఎర్రజామకాయను కూడా చేర్చుకోండి.

చాలామంది.. దగ్గు, జలుబు వచ్చినప్పుడు అసలు ఏ జామకాయ తినొద్దు అనుకుంటారు. జామకాయ వల్ల కోల్డ్ ఎక్కవ అవతుందని ఏ డాక్టర్ చెప్పలేదు. అసలు అవ్వదు కూడా.. పండు తియ్యగా ఉంది..తీపి తింటే జలుబు ఇంకా ఎక్కువైపోతుందనేది మన అపోహ మాత్రమే. నిజానికి కోల్డ్ వచ్చినప్పుడు జామకాయను తింటే.. తగ్గిపోతుంది కూడా. ఈ పండులో ఉన్న యాంటీ-ఫ్లెగ్మ్ గుణాలు బాడీని యాక్టివేట్ చేసి.. వైరస్ మీద పోరాడేలా చేస్తాయి.

ఎర్ర జామకాయలో పొటాషియం అధికంగా ఉండటం వలన రక్త ప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చూస్తుంది. గుండె ఆరోగ్యంగా హెల్తీ బ్లడ్ సర్కూలేషన్ చాలా అవసరం. ఈ పండు తింటే అలసట, నీరసం తగ్గి చురుకుగా ఉంటారు. బీ కాంప్లెక్స్‌ విటమిన్స్‌ వలన రక్తకణాల వృద్దికి సహాయపడుతుంది. అధిక బరువు సమస్య నుండి కూడా బయట పడవచ్చు.

చూశారా.. ఎన్ని లాభాలు ఉన్నాయో.. ఈసారి ఎర్ర జామకాయ కనిపిస్తే.. మొఖం తిప్పేసుకోకుండా.. తినేయండి బాస్ ..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news