ఇఫ్తార్‌ విందులో వారికి వార్నింగ్ ఇచ్చిన సీఎం కేసీఆర్‌..

-

తెలంగాణ సర్కార్‌ ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగానే ఈ ఏడాది కూడా ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. స్వరాష్ట్రం వచ్చినప్పుడు రాష్ట్రంలో తెలంగాణ నీళ్లు లేవు, కరెంట్ లేదన్నారు. చాలా దుర్భర పరిస్థితి లు ఉండే తెలంగాణ అని ఆయన అన్నారు. అల్లా, భగవంతుని దయ వల్ల మీ సహకారం వల్ల అధిగమించామన్నారు. అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాలకు సహకారం అందించాలని.. కానీ.. కేంద్ర ప్రభుత్వానికి రోగం సోకిందన్నారు.

ఆ రోగానికి చికిత్స చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాజకీయ లబ్దికోసం ప్రస్తుతం దేశంలో మత విద్వేషాలు రగుల్చుతున్నారన్నారు. అయితే అది మాత్రం తెలంగాణలో సాధ్యం కాదని.. అలాంటి మత విద్వేషలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దేశం అంతా చీకట్లో ఉంటే తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయని.. దేశ వ్యాప్తంగా మైనారిటీ గురుకుల విద్యాలయాలు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కూల్చివేతలు, పడగొట్టడాలు సులువు… దేశాన్ని నిర్మించడం కష్టమన్న సీఎం కేసీఆర్‌.. ఇక్కడ అల్లర్లు చేసే వారి ఆటలు సాగవని హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news