మహిళలూ ఈ లక్షణాలు ఉంటే అశ్రద్ధ చెయ్యద్దు.. ఇవి క్యాన్సర్ వలన అవ్వచ్చు..!

-

ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా. అనారోగ్య సమస్యలు వచ్చాయంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే చాలా మంది చిన్న చిన్న లక్షణాలే కదా అని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు కనుక ఉన్నాయి అంటే అస్సలు అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

ఎందుకంటే ఈ లక్షణాలు ఉంటే ఇవి క్యాన్సర్ కి దారి తీసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మరి మహిళల్లో ఎలాంటి లక్షణాలని అశ్రద్ధ చేయకూడదు అనే దాని గురించి చూద్దాం.

రొమ్ములో లంప్ ఉండడం:

చాలా మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఒకవేళ కనుక రొమ్ము లో లంప్ లాంటివి ఉంటే అసలు అశ్రద్ధ చేయకూడదు. వెంటనే వైద్యుడిని కన్సల్ట్ చేయాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఎక్కువ బ్లీడింగ్ తో పీరియడ్స్:

నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువ అవుతున్న..వారం రోజుల కంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతున్నా సరే గైనకాలజిస్ట్ ను సంప్రదించడం మంచిది. అలానే పీరియడ్స్ సమయం కానప్పుడు కూడా స్పాటింగ్ లేదా సెక్స్ తర్వాత బ్లీడింగ్ అయినా సరే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మంచిది.

మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ అవడం:

మహిళలందరికీ కూడా కొంత వయస్సు వచ్చిన తర్వాత పీరియడ్స్ ఆగిపోతాయి. అయితే మెనోపాజ్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా బ్లీడింగ్ అవుతున్న కచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. ఇది కూడా క్యాన్సర్ కి దారితీసే అవకాశం ఉంది. ఈ లక్షణాలు మహిళల్లో ఉంటే అసలు అశ్రద్ధ చేయకూడదు వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేసి సమస్య నుండి బయట పడాలి.

Read more RELATED
Recommended to you

Latest news