ఈ మొక్కలని అస్సలు ఇంటి ముందు పెట్టద్దు..!

-

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. అంతా మంచి జరుగుతుంది చెడు అంతా కూడా ఇంట్లో నుండి దూరం అవుతుంది. అయితే చాలామంది ఇంట్లో అందంగా ఉంటాయని మొక్కల్ని పెంచుతూ ఉంటారు మొక్కల్ని పెంచేటప్పుడు కూడా కొన్ని వాస్తు చిట్కాలని పాటించాలి. మొక్కలను పెంచేటప్పుడు ఎటువంటి వాస్తు నియమాలని పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

 

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కలు ప్రధాన ద్వారం వద్ద పెట్టకూడదు మరి ఎటువంటి మొక్కలని ప్రధాన ద్వారం దగ్గర పెట్టకూడదు అనే విషయానికి వచ్చేస్తే, ముళ్ళ మొక్కలని అస్సలు ముఖద్వారం దగ్గర పెట్టకూడదు. అలానే శని తో సంబంధం కలిగి ఉన్న మొక్కల్ని కూడా పెట్టకూడదు. శనీశ్వరుడి అంశతో గొడవ పడుతుంది. దీని వలన శనిగ్రహం యొక్క శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శమీ మొక్కని ఇంటికి ఎదురకుండా పెట్టకూడదు ఈ మొక్క ని ఇంటి ముందు ఉంచడం అసలు మంచిది కాదు. ఇది అశుభ ఫలితాలను తీసుకువస్తుంది.

ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెడితే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ తప్పుని చేయకండి అలానే ఇంక ఎక్కడైనా మీరు ఈ మొక్కని నాటుకోవచ్చు. ఈ మొక్క ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది శ్రావణమాసంలో ఈ చెట్టుని నాటితే శివుని అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇది శ్రావణమాసం కాబట్టి మీరు ఈ మొక్కని మీ ఇంట్లో నాటొచ్చు. శివపురాణం ప్రకారం శివుడికి జమ్మి ఆకులు అంటే ఎంతో ప్రీతి. గణేశుడికి కూడా జమ్మి ఆకులు ఇష్టం సమస్యలు తొలగడమే కాకుండా శని దోషం కూడా తగ్గుతుంది. కాబట్టి వీటిని పాటించడం మంచిది. బాధలనుండి బయటపడొచ్చు ఆనందంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news