LIC కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..!!

-

ప్రముఖ ప్రభుత్వ భీమా సంస్థ ఎల్ఐసి ఎన్నో పథకాలను అందిస్తూ వస్తుంది.. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభాలు పొందేలా కొత్త పథకాలను అందిస్తూ వస్తుంది..తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..దీని వల్ల డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊటర కలుగుతుందని చెప్పుకోవచ్చు..కొత్త వడ్డీ రేట్లు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఇప్పుడు 7.25 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీని ఆఫర్ చస్తోంది. ఏడాది నుంచి ఐదేళ్ల వరకు టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది…

ఈ పథకంలో 18 నెలలు, 2 ఏళ్లు, 3 ఏళ్లు, ఐదేళ్లు టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు. కమ్యూలేటివ్ పబ్లిక్ డిపాజిట్ స్కీమ్ కింద మీరు డబ్బులు దాచుకోవచ్చు. రూ. 20 కోట్ల వరకు, ఆపైన మొత్తాన్ని డబ్బులు దాచుకోవచ్చు. వడ్డీ డబ్బులు ప్రతి ఏటా ఎఫ్‌డీ అకౌంట్‌లో జమ అవుతాయి. అయితే మెచ్యూరిటీ తర్వాతనే చెల్లిస్తారు. అంటే ఒకేసారి భారీ మొత్తం పొందొచ్చు..అయితే,రూ. 20 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రూ. 20 కోట్లలోపు మొత్తంపై అయితే ఒక రకమైన ఎఫ్‌డీ రేటు లభిస్తుంది. ఏడాది టెన్యూర్‌పై అయితే 7.25 శాతం పొందొచ్చు. 18 నెలల టెన్యూర్‌పై అయితే 7.35 శాతం వర్తిస్తుంది. 2 ఏళ్ల ఎఫ్‌డీలపై 7.6 శాతం, మూడేళ్ల ఎఫ్‌డీలపై 7.75 శాతం, ఐదేళ్ల ఎఫ్‌డీలపై 7.75 శాతం వడ్డీ వస్తుంది. కమ్యూలేటివ్ ఎఫ్‌డీలకు ఇది వర్తిస్తుంది.

ఏడాది టెన్యూర్‌పై 7 శాతం, 18 నెలల టెన్యూర్‌పై 7.1 శాతం, రెండేళ్ల టెన్యూర్‌పై 7.35 శాతం, మూడేళ్ల టెన్యూర్‌పై 7.75 శాతం, ఐదేళ్ల టెన్యూర్‌పై 7.5 శాతం వడ్డీ ఉంటుంది. అదే ఏడాది పేమెంట్ ఆప్షన్ అయితే వడ్డీ రేటు మళ్లీ మారుతుంది. అంతేకాకుండా ఆటో రీపేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మెచ్యూరిటీ తర్వాత డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చి చేరతాయి.బ్యాంకులలో వచ్చే వడ్డీలతో పోలిస్తే ఇది ఎక్కువగా ఉందని తెలుస్తుంది.మీకు నచ్చిన టెన్యూర్ ఎంచుకోవచ్చు. అలాగే నచ్చిన పేమెంట్ ఆప్షన్ ఓకే చేసుకోవచ్చు. నచ్చిన మొత్తాన్ని డిపాజిట్ చేయొచ్చు. ఐదేళ్ల వరకు డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి..

Read more RELATED
Recommended to you

Latest news