మార్కెట్‌లో బాగా డిమాండ్ ఉన్న కోర్సులు ఇవి.. చేస్తే జాబ్ లేదా ఉపాధి ప‌క్కా..!

-

మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా ఉద్యోగులు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌ను తాము మార్చుకుంటుండాలి. లేదంటే వెనుక‌బ‌డిపోతుంటారు. ఉద్యోగాల సాధ‌న‌లో ఇత‌రుల‌తో పోటీ ప‌డాలంటే ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కోర్సులు courses, మెళ‌కువ‌ల‌ను నేర్చుకోవాలి. దీని వ‌ల్ల కెరీర్‌లో ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవ‌చ్చు. కొత్త కొత్త అవ‌కాశాలు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని ర‌కాల కోర్సుల వివ‌రాల‌ను కింద అందిస్తున్నాం. వీటికి ప్ర‌స్తుతం బాగా డిమాండ్ ఉంది. వీటిని నేర్చుకుంటే కెరీర్‌లో ఇంకా ముందుకు వెళ్ల‌వ‌చ్చు. ఉద్యోగం లేని వారు వీటిని నేర్చుకుంటే ఉద్యోగం వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. మ‌రి ఆ కోర్సులు ఏమిటంటే..

కోర్సులు /courses
కోర్సులు /courses

1. ప్ర‌స్తుతం అన్ని రంగాల్లోనూ డేటా కీల‌కంగా మారింది. అందువ‌ల్ల డేటా సైన్స్ కోర్సును నేర్చుకుంటే ఉపాధి అవ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అనేక ప‌రిశ్ర‌మ‌ల‌కు, కార్పొరేట్ సంస్థ‌ల‌కు డేటాను నిర్వ‌హించ‌డం కీల‌కంగా మారింది. క‌నుక ఈ రంగంలో పుష్క‌లంగా ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయి.

2. ప్ర‌స్తుతం అనేక ర‌కాల కంపెనీలు, ప‌రిశ్ర‌మ‌లు, సంస్థ‌లు ఆన్ లైన్‌లో త‌మ ఉత్ప‌త్తుల‌కు ప్రాచుర్యం క‌ల్పించేందుకు, త‌మ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు చూస్తున్నాయి. క‌నుక వాటికి గాను డిజిట‌ల్ మార్కెటింగ్ కోర్సును చేయాలి. ఈ రంగంలోనూ ప్ర‌స్తుతం ఉపాధి అవ‌కాశాలు బాగానే ఉన్నాయి.

3. ఎన్నో వేల ప‌దాల్లో చెప్ప‌లేని భావాల‌ను ఒక్క చిత్రంతో చెప్ప‌వ‌చ్చు. అందుక‌ని గ్రాఫిక్ డిజైనింగ్‌కు ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. ఈ కోర్సును చేసినా అద్భుత‌మైన అవ‌కాశాల‌ను పొంద‌వ‌చ్చు. లేదా సొంతంగా స్వ‌యం ఉపాధి పొంద‌వ‌చ్చు.

4. త‌క్కువ పెట్టుబ‌డితోనే ఇంట్లోనే స్వ‌యం ఉపాధి పెట్టుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అయితే వాటికి కొద్దిగా స్కిల్స్ అవ‌స‌రం. వాటినే ఎంట‌ర్‌ప్రిన్యూర్‌షిప్ స్కిల్స్ అంటారు. చాలా అకాడ‌మీలు ఈ స్కిల్స్ ను నేర్పిస్తున్నాయి. వాటిని నేర్చుకుంటే సొంతంగా ఉపాధి క‌ల్పించుకుని అందులో రాణించ‌వ‌చ్చు.

5. ఏ ప్రాజెక్టుకు చెందిన వివ‌రాల‌ను అయినా ప్ర‌జెంట్ చేయాల‌న్నా, లీడ‌ర్ షిప్ ల‌క్ష‌ణాల కోసం అయినా సాఫ్ట్ స్కిల్స్ అవ‌స‌రం. ఉద్యోగులు, స్వ‌యం ఉపాధి పొందేవారికి ఇవి అవ‌స‌రం. క‌నుక ఈ స్కిల్స్‌ను నేర్చుకుంటే ఉద్యోగం లేదా ఉపాధిలో మ‌రింత ముందుకు దూసుకెళ్ల‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news