రేవంత్‌కు కౌశిక్‌ రెడ్డి సవాల్‌…దమ్మంటే రా చూసుకుందాం !

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్న కౌశిక్‌ రెడ్డి…తన రాజకీయ నిర్ణయానికి ఉత్తమ్ కి ఎలాంటి సంబంధం లేదన్నారు. పార్టీ రాజీనామా తన సొంత నిర్ణయమని పేర్కొన్నారు. రేవంత్‌ దమ్మున్న మొగోడైతే…హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్‌ ను దక్కించుకోవాలని సవాల్‌ విసిరారు. పిసిసి చీఫ్ గా రేవంత్ అవ్వాలని కోరుకున్న వ్యక్తిని తానని… ఆయనకు ఎంత సాయం చేశానో ఆయనకు..తనకు తెలుసు అని తెలిపారు. బాధతో కాంగ్రెస్‌ రాజీనామా చేస్తున్నానని.. ఆయన పిసిసి గా పని చేయడం లేదన్నారు.

పిసిసిగా ఉండి… హుజూర్ బాద్ లో గెలవదు అని ఎలా అంటారని రేవంత్‌ రెడ్డిపై ఫైర్‌ అయ్యారు. ఈటల రాజేందర్‌ కాంగ్రెస్ లో ఉంటే గెలిచే వాడు అని ఎలా అంటారని…ఈటెల బీజేపీ లో చేరిన తర్వాత కూడా పిసిసి రేవంత్‌ అలా మాట్లాడితే ఎలా ? అని ప్రశ్నించారు.

మేమంతా పిచ్చోల్లమా? తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఠాగూర్ యూస్‌ లెస్‌ ఫెలో అని ఫైర్‌ అయ్యారు. 50 కోట్లు ఇచ్చి రేవంత్… పీసీసీ పదవీ తీసుకున్నారని ఆరోపించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు పిసిసి ఎందుకు ఇవ్వలేదని.. కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి లకు ఇవ్వొచ్చు కదా ? అని ప్రశ్నించారు. మానిక్ అమ్ముడు పోయి పిసిసి ఇచ్చాడు.