యుపిఐ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయితే… ఈ పనులని తప్పక చెయ్యండి..!

-

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కి మాత్రమే ప్రయారిటీని ఇస్తున్నారు మన దేశంలో చాలా మంది స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు యూపీఐ చెల్లింపుల ద్వారానే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ కారణంగా డబ్బులు పంపించడం చాలా ఈజీ అవుతోంది. పైగా మనం ఎవరైనా డబ్బులు పంపితే క్షణాల్లో రిసీవ్ చేసుకోవచ్చు. ఈరోజుల్లో షాపింగ్ చేసినా పెట్రోల్ బంకు కి వెళ్లినా ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ని మాత్రమే చేస్తున్నారు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయి.

ఆన్లైన్లో ఈజీగా మనం క్షణాల్లో డబ్బులు ని పంపించుకోవచ్చు కాబట్టి ఎవరూ కూడా క్యాష్ ని వాళ్ళతో పాటుగా తీసుకు వెళ్లడం లేదు. కేవలం ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే క్యాష్ ని వాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా యూపీఐ టెక్నాలజీ మీద ఆధారపడిపోయారు. ఇలా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొన్ని సార్లు పేమెంట్ ఫెయిల్ అవ్వచ్చు. పేమెంట్ ఫెయిల్ అయితే ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మనం యూపీఏ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అది ఫెయిల్ అవుతూ ఉంటుంది అది ఎందుకు ఫెయిల్ అవుతుంది అలాంటప్పుడు ఏం చేయాలి అనేది మరి ఇప్పుడే చూసేయండి.

UPI లిమిట్ చూసుకోండి:

UPI లావాదేవీల కోసం మీరు రోజుకు ఎంత సెండ్ చెయ్యచ్చు అనేది పంపవచ్చు అనేది చూసుకోండి. లిమిట్ అయితే డబ్బులని పంపడం అవ్వదు. NPCI మార్గదర్శకాల ప్రకారం UPI లావాదేవీలను రోజుకు గరిష్టంగా రూ.1 లక్ష మాత్రమే చెయ్యవలసి వుంది. కనుక రోజుకు రూ.ఒక లక్ష లోపే ట్రాన్సాక్సన్లు చెయ్యాలి.

మల్టీ అకౌంట్లను మీరు ఉపయోగించవచ్చు:

UPI పేమెంట్స్ ఫెయిల్ అయినా లేదా ట్రాన్సాక్షన్స్ అవ్వకపోయినా బ్యాంకు సర్వర్ రద్దీ కావచ్చు. ఇలాంటప్పుడు UPI IDకి మల్టీ బ్యాంక్ అకౌంట్లను లింక్ చేయండి. బ్యాంకు సర్వర్ డౌన్ అయినా మరో బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ ని మీరు చేయొచ్చు. డబ్బులని పంపేటప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్, IFSC కోడ్, UPI వివరాలను చూడచ్చు.

పిన్ చూసుకోండి:

UPI పిన్ నెంబర్‌ను మరచిపోతే కూడా కష్టమే. ఒకవేళ మర్చిపోతే ‘‘UPI పిన్‌ forget’’ ఆప్షన్‌ను ప్రెస్ చేసి అప్పుడు మీరు మీ సీక్రెట్ పిన్‌ని రీసెట్ చేసుకోవచ్చు. ఎవ్వరితోనూ కూడా మీ పిన్ ని షేర్ చేయద్దు.

నెట్వర్క్ సమస్య:

ఈ సమస్య వలన కూడా డబ్బులని పంపడం అవ్వదు. ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేకపోతే ట్రాన్సాక్షన్స్ జరగవు.

UPI లైట్:

NPCI గత ఏడాది UPI లైట్‌ని ప్రవేశ పెట్టింది. UPI లైట్ ద్వారా తక్షణమే రూ.200 వరకు ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. దీని నుండి రోజుకు రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు పంపుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news