మామిడి పండుతో పెరుగన్నం తింటున్నారా? అయితే డెంజరే..

-

ఎండాకాలం వచ్చిందంటే.. మామిడిపళ్లు మార్కెట్ లోకి వచ్చేస్తాయి. మమిడిపళ్లను ఇష్టపడని తెలుగోడు అంటూ ఉండడమే కదా.. వీటిని కొందరు ముక్కులు చేసుకుని తింటే.. మరికొందరు.. మాంచి రసం కాయ తీసుకుని.. పెరుగు అన్నం కాంబినేషన్ తో తీసుకుంటారు. టేస్ట్ బెస్ట్ గా ఉన్నా.. ఆరోగ్యానికి ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. పెరుగుతో కొన్ని పండ్లను కలిపి తీసుకోకూడదు. అవేంటో ఈరోజు చూద్దాం.

పెరుగులో కాల్షియం, విటమిన్ బి-2, విటమిన్ బి-12, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు చాలానే ఉంటాయి.. అందుకే భోజనంలో క్లైమాక్స్ అందరూ పెరుగు కచ్చితంగా తీసుకుంటారు. అయితే తినే వాళ్లు కేవలం పెరుగు అన్నం మాత్రమే తినరు.. సైడ్ కి ఫ్రూట్స్ కావాలి.. దోసకాయ, యాపిల్, ద్రాక్ష, మామిడి పండ్లను పెరుగులో కలిపి తింటుంటారు. ఐతే ఈ పండ్లను అస్సలు పెరుగుతో కలిపి అస్సలు తినకూడదు.

పండిన మామిడికాయతో పెరుగన్నం తింటారు.. ఇలా కలిపి తింటే శరీరం చల్లగా ఉంటుంది. దీనితోపాటు చర్మ సమస్యలు తలెత్తుతాయి.

పెరుగు చేపలంటే మనందరికీ ఇష్టమే. పుల్లటి లేదా తీపి పెరుగుతో చేపలను తింటే వెజిటబుల్ ప్రొటీన్లు, యానిమల్ ప్రొటీన్లు కలిసిపోయి జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. తిన్నా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. పాలు, చేపలు కూడా కలిపి తీసుకోకూడదు.

చాలా మంది పరోటాను పెరుగు రైతాతో లాగించేస్తుంటారు.. ఈ విధంగా తినడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది.. ఫలితంగా జీర్ణక్రియ సమస్యలకు దారి తీస్తుంది. పరోటాతో పాటు ఆయిల్ ఫుడ్, పెరుగు కూడా తినకూడదు. ఇలా తింటే నిద్ర అధికంగా వస్తుంది.

దోసకాయ, బూందీతో పెరుగు చట్నీ చేసుకోవచ్చు. ఐతే దీనిలో ఉల్లిపాయ అస్సలు వేసుకోకూడదు. ఎందుకంటే..పెరుగు శరీరాన్ని చల్లబరుస్తుంది. ఉల్లిపాయ శరీరాన్ని వెచ్చపరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు కలిపి తింటే ఎలర్జీ సమస్యలు, ఎగ్జిమా తదితర చర్మ సమస్యలు వచ్చే అ‌వకాశం లేకపోలేదు.

కొందరు డిన్నర్ లో పెరుగు అన్నం తిని.. నైట్ పడుకునే ముందు పాలు తాగుతారు. ఇలా కూడా అసలు చేయకూడదు. జీర్ణక్రియ సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news