ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై తనదైన శైలీలో స్పందించారు. ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీలో కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ రాష్ట్రంలో కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ట్యాక్స్ ఫ్రీ చేయాలని కొంత మంది బీజేపీ నాయకులు అంటున్నారని అన్నారు. దేశంలో పలు రాష్ట్రాల్లో ఈ సినిమాపై ట్యాక్స్ ఫ్రీ ప్రకటించారని బీజేపీ నాయకులు అంటున్నారని అన్నారు. అయితే ట్యాక్స్ ఫ్రీ చేయడం కంటే.. కశ్మీర్ ఫైల్స్ సినిమాను డైరెక్ట్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేయమని బీజేపీ నాయకులు ఆ చిత్ర బృందాన్ని కోరాలని అన్నారు.
అలా అయితే.. అందరూ కూడా ఫ్రీ గా చూస్తారని అన్నారు. కాగ బీజేపీ పాలిత రాష్ట్రాలు కశ్మీర్ ఫైల్స్ హడావుడీ చేస్తున్నారని అన్నారు. అయితే అంత హడావుడీ అవసరం లేదని సమాధానం ఇచ్చారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా చేసి కశ్మీర్ పండిట్ల పేరుతో కొంత మంది కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారని సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్లు అయితే.. ఆ సినిమా పోస్టర్లను గోడకు అంటించడమే తక్కువ అని విమర్శించారు. కాగ కశ్మీర్ ఫైల్స్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పోస్టు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
RT if you want @vivekagnihotri to upload #TheKashmirFiles on YouTube for FREE 🙏🏻pic.twitter.com/gXsxLmIZ09 https://t.co/OCTJs1Bvly
— AAP (@AamAadmiParty) March 24, 2022