డయాబెటీస్ ఉందా..? చెరుకు రసం తీసుకోవచ్చా..?

-

ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటిస్ తో బాధ పడుతున్నారు డయాబెటిస్ ఉన్న వాళ్లు ఆరోగ్యకరమైన సూత్రాలని పాటించాలి. అదే విధంగా డయాబెటిస్ ఉన్న వాళ్లు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి అనేది చూసుకుని వాటిని మాత్రమే తీసుకోవాలి చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది.

డయాబెటిస్ ఉంటే చెరుకు రసం తీసుకోవచ్చా…? లేదా అని… అయితే మరి మధుమేహం ఉన్న వాళ్ళు చెరకు రసం తీసుకువచ్చా లేదా అనేది ఇప్పుడే చూసేద్దాం. చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది మీకు కూడా ఈ సందేహం ఉంటే వెంటనే క్లియర్ చేసుకోండి.

చెరుకు రసం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ తో ఉంటుంది అని తక్కువ ఉంటుంది కదా అని చాలా మంది తీసుకుంటారు. కానీ గ్లైసెమిక్ లోడ్ ఎక్కువగా ఉంటుంది అంటే మీరు దీన్ని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలపై ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది.
పైగా ఇందులో ఉండే చక్కెర స్వచ్ఛమైనది కాదు. చక్కెర సుక్రోస్ రూపంలో 70 నుండి 75% దాకా ఉంటుంది. సుక్రోస్ అనేది షుగర్ కి ఇంకో రూపం.
అందుకే షుగర్ ఉన్న వాళ్ళు చెరుకుని లేదా చెరుకు రసాన్ని ఎక్కువగా తీసుకోకూడదు దీనితో ఎక్కువ శాతం చక్కెర మీ బాడీలో చేరే అవకాశం ఉంది.
అలా అని పూర్తిగా దూరంగా ఉంచక్కర్లేదు తక్కువగా తీసుకోవచ్చు. బయట చాలా చోట్ల చెరుకు రసం అమ్మేవాళ్లు కొంచెం పంచదారని కలిపి ఇస్తూ ఉంటారు. అలాంటివి వద్దు. స్వచ్ఛమైనది తీసుకోండి తప్ప పంచదార కలిపిన వాటిని అస్సలు తీసుకోవద్దు మూడు నాలుగు నెలలకి ఒకసారి తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది రాదు.

Read more RELATED
Recommended to you

Latest news