మనకు గాఢ నిద్రలో వున్నప్పుడు తప్పక కలలు వస్తుంటాయి.కొన్ని కలలు సంతోషాన్ని కలిగిస్తే.. మరి కొన్ని ఆందోళనలను, భయాన్ని కలిగిస్తాయి.అవి నిజము అవుతాయో లేదో కానీ వాటిల్లో మాత్రం లోతైన అర్ధాలు దాగి వుంటాయని చెబుతారు సైకో అనలిస్టులు.అయితే ఏ కలకు ఎలాంటి అర్థం ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
ఎవరో తరుముటున్నట్టు..
మనల్ని ఎవరో తరుముటున్నట్టు కల వస్తే మన జీవితంలో ఏదో సాధించకుండా తప్పించుకు తిరుగుతున్నామనీ అర్థం.అదే జంతువులు, పాములు తరుముతున్నట్టు కల వస్తే మనలోని కోపం, ఉద్రేకం బయటపెట్టకుండా అణిచి పెట్టుకున్నట్టు అర్థం. పిల్లలు తరుమూతున్నట్టు వస్తే మన జీవితంలో ఎవరినో ప్రేమించి,వారు దక్కక బాధపడుతున్నట్టు అర్థం.
బట్టలు లేకుండా..
రోడ్లో కానీ, ఇంట్లో కానీ బట్టలు లేకుండా ఉన్నట్టు కలలు వస్తే మనలోని లోపాలు,మనసు అంతరాత్మ గురించి బయటివారు ఎవరైనా తెలుసుకుంటారేమోననీ భయపడుతున్నట్టు అర్థం.
ఎక్జామ్..
మన చదువుమొత్తం అయిపోయినా ఏదో ఒక ఎక్జామ్ రాస్తున్నట్టు, దానికి మనము ప్రిపేర్ అవలేదే అని బయపడుతున్నట్టు వస్తే మనము లైఫ్ లో అనుకున్నది సాధించకుండా ఉన్నదానితో సర్దుకుపోతున్నట్టు అర్థం అని సైకో అనలిస్టులు చెబుతారు.
మరణం..
మన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు మరణించినట్టు కలలు వస్తే.. దానర్థం ఏదో మార్పు జరగబోతునట్లు దానికి భయపడుతున్నట్టు, ఆందోళన చెందుతున్నట్టు అర్థం. మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు మరణించినట్టుగా వార్తలు వస్తే,గతంలో జరిగిన చెడును తలచుకుని బాధపడుతున్నట్టు అర్థం.
గాలిలో ఎగురుతున్నట్టు..
మంచి నిద్రలో వున్నప్పుడు గాలిలో ఎగురుతున్నట్టు లేదా ఎత్తు నుండి కిందకి పడుతున్నట్టు కల వస్తే మనము మన జీవితం గురించి ఏదో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్టు అర్ధం, అదే విధంగా ఏదో పట్టుదల గా చేయాలనీ ఆలోచించిస్తున్నారని అర్థం.
పళ్లు ఊడటం..
మీకు పళ్లు ఊడుతున్నట్టుగా కలలు వస్తే మీరు మీ బాడీ షేప్ విషయంలో తెగ బాధపడుతున్నట్టు అర్థం. మీ వద్ద ఉన్నదేదో మీరు ప్రపంచానికి చాటి చెప్పడానికి భయపడి దాస్తున్నారని అని అర్థం.