వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ వీడియోపై ఏపీ రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఈ వీడియో ఎంపీ మాధవ్‌ది కాదని వెల్లడించారు. అయితే.. దీనిపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ స్పందిస్తూ.. ఎంపీ న్యూడ్ వీడియోకు సంబంధించి ప్రభుత్వానికి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిందని, ఆ రిపోర్టు ఎంపీ మాధవ్ కు వ్యతిరేకంగా వచ్చిందన్నారు. వ్యతిరేకంగా రిపోర్ట్ వచ్చింది కాబట్టే.. అనంత ఎస్పీతో మాట్లాడించారని, తాడేపల్లి నుంచి వెళ్లిన స్క్రిప్టును అనంత ఎస్పీతో చెప్పించారన్నారు బొండా ఉమ. న్యూడ్ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబుకు పంపామన్నారు. రిపోర్టులో ఒరిజనల్ అని తేలితే చర్యలు ఉంటాయని చెప్పారు. ల్యాబుకు అసలు వీడియోనే పంపలేదని ఎస్పీ చెప్పారు. హోం మంత్రి మాట ఏమైంది..? సకల శాఖ మంత్రి మాటలు ఏమయ్యాయి..? అసలు ఏ టెక్నికల్ గ్రౌండ్స్ మీద అనంత ఎస్పీ మాట్లాడారు..? తానే ఫిర్యాదు చేశానని గోరంట్ల మాధవ్ చెప్పారు.. కానీ ఎస్పీ మాత్రం తనకెలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.
ఎంపీ మాధవ్ వీడియో మార్ఫింగ్ అయ్యిండొచ్చు.. ఎడిటింగ్ అయ్యిండొచ్చు అని భావిస్తున్నామని ఎస్పీ ఎలా చెబుతారు..? వీడియో ఎనాలసిస్ చేస్తే.. ఆ వీడియో పుట్టు పూర్వొత్తరాలు తీయొచ్చు. వైసీపీ ప్రజల్లో పతనమవుతోందని.. ఎస్పీతో ప్రెస్ మీట్ పెట్టించారు. అసలు వీడియోలో ఎంపీనో కాదోననే విషయాన్ని గుర్తు పట్టలేకపోతున్నామని ఎస్పీ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఒరిజనల్ వీడియోకు ఒకరు వేరేవారికి పంపితే.. వాళ్లు వీడియో చూస్తుంటే దాన్ని మూడో వ్యక్తి రికార్డ్ చేశారంటున్నారు. ఇంతకీ ఎవరా ముగ్గురు..? ఎవ్వరి ఫోన్లల్లోనూ ఒరిజనల్ వీడియోలు ఉండవు.. అయినా విచారణ చేపట్టడం లేదా..? గోరంట్ల మాధవ్ ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదు..? మాధవ్ ను రక్షించేందుకే పోలీసులు విచారణ చేపట్టారు అంటూ బొండా ఉమ ఆరోపించారు.